కేంద్రాన్ని నిలదీస్తాం

మార్చి 5వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశంలో అనేక అంశాలు అమలు కాలేదని, పెద్ద ఎత్తున కేంద్రాన్ని నిలదీయాలని చర్చించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. రిజర్వేషన్లను కేంద్రం దగ్గరపెట్టుకోవడం సరికాదని, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా..కేంద్రం నుంచి సరైనా క్లారిటీ రాలేదన్నారు. కేంద్రం తీరుపై పోరాడాలని నిర్ణయించామన్నారు.

70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత  ఈ రిజర్వేషన్లు కేంద్రం దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదని.. శాసన సభలో తీర్మానం చేసినప్పుడు  ఈ మాట బలంగా చెప్పి పంపించామన్నారు. ఉద్యోగాలు, విద్యా అవకాశాలు ఇచ్చే రిజర్వేషన్లను మా రాష్ర్టాల పరిధిలో ఇస్తున్నం కాబట్టి కేంద్రం నుంచి అడుగుతలేమని..  అది మీదగ్గర పెట్టుకోకండి అని చెప్పా మన్నారు. దాని మీద స్పందన లేదు. లేకపోగా.. సేమ్ అదే పాత పద్ధతిని కొనసాగిస్తామని కేంద్రం చెబుతున్నదని… ఈ విషయంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తమన్నారు. రిజర్వేషన్ల గురించి సుప్రీం కోర్టు చెప్పినట్లుగా రాజ్యాంగ సవరణ చేయొచ్చు. పెద్ద కష్టమేమి కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండే అది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆర్టికల్ 16ను సవరణ చేయొచ్చు. బిల్లు కూడా పాస్ అవుతుంది. కాకపోతే కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ల గుప్పిట్లో పవర్ పెట్టుకోవాలని కూర్చుంటున్నదన్నారు సీఎం.

నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎంపీలు పోరాటం చేస్తారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. ఎయిమ్స్..కాజీపేట రైల్వే కోచ్ లాంటి విషయాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణలో అనేక పథకాలు ప్రవేశపెట్టి, దేశంలోనే గర్వించతగ్గ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. తమ స్కీములో గోప్యంగా ఉండవని..ప్రజలకు తెలిసేలా ఉంటాయన్నారు. ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుందని, పట్టాదారు పాస్ పుస్తకాలు..కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు సీఎం కేసీఆర్.