ప్ర‌జ‌ల మ‌నిషి బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సామాన్యులు అత్యంత శ‌క్తివంత‌మైన రాచ‌రికాన్ని కూక‌టివేళ్ల‌తొ పెక‌లించేందుకు సాగించిన‌ పోరు మ‌హ‌త్త‌ర‌ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. క‌ట్టుబానిస‌త్వం, వెట్టిచాకిరి నుంచి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం, స‌మాన‌త్వం కోసం క‌ర్క‌శ నిజాం నిరంకుశ పాల‌న‌పై ఉక్కు పిడికిలి బిగించిన ఈ అస‌మాన పోరు భార‌తావ‌నికి పోరాట ప‌టిమ‌, త్యాగం, నిస్వార్థం, నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌లాంటి అనేక‌ గొప్ప సామాజిక‌, రాజ‌కీయ‌, నైతిక విలువ‌ల‌ను అందించింది. ‘జీవిత‌మే ప్ర‌జ‌లు… ప్ర‌జ‌లే జీవితం’గా ఆజ‌న్మాంతం స‌మాజం కోసం నిల‌బ‌డి పోరాడే ఎంద‌రో యోధుల‌ను తీర్చిదిద్దింది. అలాంటి సంగ్రామ సింహాల్లో అగ్ర‌జుడు, తొలిత‌రం యోధుడు బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం. నిజాం ప్ర‌భువు, ఆయ‌న తాబేదార్ల రాక్ష‌స పాల‌న‌, ఆకృత్యాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జా ఉద్య‌మ సేనానిగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకున్నాడు. పాఠ‌శాల విద్యార్థిగా నిజాం ప్ర‌భువు ప‌ట్టాభిషేక ర‌జ‌తోత్స‌వ వేడుక బ‌హిష్క‌ర‌ణ‌తో మొద‌లైన ధిక్కార స్వ‌రం… ఆ త‌ర్వాత ప్ర‌జాస్వామ్య ప్ర‌భువుల వ‌ద్ద కూడా వెర‌వ‌కుండా సాగింది. దాదాపు ఏడు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జా ఉద్య‌మాలే ఉచ్ఛ్వాస‌, నిశ్వాస‌లుగా ఎదిగి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన అరుదైన నాయ‌కుడాయ‌న‌. ప్ర‌తి మ‌లుపులో ప్ర‌జ‌లు, ప్ర‌జా ఉద్య‌మాల ప‌క్షాన నిల‌బ‌డి జిల్లా, రాష్ట్ర‌, కేంద్ర స్థాయి నేత‌గా ఎదిగి తుది శ్వాస వ‌ర‌కు రాజీప‌డ‌కుండా అవిశ్రాంతంగా పోరాడిన నిశ్వార్థ‌, నిరాడంబ‌ర యోగిపుంగ‌వుడు ప్ర‌జ‌ల మ‌నిషి బొమ్మ‌గాని ధ‌ర్మబిక్షం. జీవితాంతం క‌ట్టుబ‌డి నిర్వ‌ర్తించిన సామాజిక ధ‌ర్మ‌మే త‌ల్లిదండ్రులు పెట్టిన ‘బిక్షం’ పేరు ప్రజల్లో ధ‌ర్మ‌బిక్షంగా స్థిర‌ప‌డిపోయేలా చేసింది.
బొమ్మ‌గాని ముత్తు లింగం, గోప‌మ్మ దంప‌తుల‌కు 1922 ఫిబ్ర‌వ‌రి 15న జ‌న్మించాడు ధ‌ర్మ‌బిక్షం. ఆయ‌న‌ స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ జిల్లా మారుమూల ప్రాంత‌మైన మునుగోడు మండ‌లం ఊకొండి గ్రామం. కొంత కాలానికి వారి కుటుంబం సూర్యాపేట ప‌ట్ట‌ణంలో స్థిర‌ప‌డింది. నిజాం రాచ‌రికానికి ఎదురులేకుండా సాగుతున్న రోజులవి. ఆ రోజు సూర్యాపేట‌ ఉన్న‌త పాఠ‌శాల‌లో నిజాం ప‌ట్టాభిషేక ర‌జ‌తోత్స‌వం. విద్యార్థిగా విద్యార్థులంద‌రినీ కూడ గ‌ట్టి పాఠ‌శాల‌లో ర‌జ‌తోత్స‌వం వేడుక‌ల‌ను విజ‌య‌వంతంగా బ‌హిష్క‌రించి… నూనూగు మీసాల వ‌య‌సులోనే నిరంకుశ నిజాం రాచ‌రికాన్ని ఎదురించిన ధీరుడు ధ‌ర్మ‌భిక్షం. పాఠ‌శాల విద్యార్థిగా ఉన్న‌కాలంలో దేశ స్వాతంత్ర్య పోరాటం, నిరంకుశ నిజాం పాల‌న‌, మున‌గాల ప‌ర‌గ‌ణాలో జ‌రుగుతున్న రైతు పోరాటాల ప్ర‌భావంతో పాఠ‌శాల విద్యార్థిగానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పుణికి పుచ్చుకున్నారు.
నిరంకుశ పాల‌న‌, దోపిడీ, అన్యాయాల‌కు వ్య‌తిరేకంగా మ‌న‌సులో బ‌ల‌మైన భీజాలు నాటుకున్నాయి. దానికి తోడైన అభ్యుద‌య సాహిత్యం చైతన్యాన్ని ర‌గిలించి ఆయ‌న ద‌శ‌దిశ‌ను మార్చివేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం, నిజాం రాక్ష‌స పాల‌న నుంచి తెలంగాణ నేల విముక్తి కోసం పోరుదారి ప‌ట్టారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తూనే పేద విద్యార్థుల కోసం సూర్యాపేట‌లో విద్యార్థి వ‌స‌తిగృహం(హాస్ట‌ల్‌)ను ప్రారంభించాడాయ‌న‌. న‌ల్ల‌గొండ జిల్లా విద్యార్థి సంఘ స్థాప‌న‌కు, విద్యార్థి ఉద్య‌మ నిర్మాణానికి ఆ హాస్ట‌ల్ వేదికైంది. ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఉప్పునూత‌ల పురుషొత్తం రెడ్డి, సీపీఎం అగ్ర‌నేత మ‌ల్లు వెంక‌ట న‌ర్సింహ రెడ్డి, త‌దిత‌ర నేత‌లు ఈ హాస్ట‌ల్‌లో ఆశ్ర‌యం పొంది చ‌దువుకుని ఎదిగిన వారే. అంతేకాకుండా ప‌లువురు ఐఎఎస్‌, ఐపీఎస్, సీనియ‌ర్ అధికారులైన వారు కూడా ఉన్నారు. స్వాతంత్రోద్య‌మ కార్య‌క్ర‌మాల్లో నిత్యం తీరిక‌లేకుండా ఉన్న‌ప్ప‌టికీ… హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌జ‌ల నుంచి బిచ్చం ఎత్తేవాడు. ఆ విధంగా ప్ర‌జ‌ల వ‌స్త‌వులు, స‌రుకుల రూపంలో తెచ్చి హాస్ట‌ల్ నిర్వ‌హించి, విద్యాభ్యున్నతి కోసం ఒక అద్భుత‌మైన న‌మూనాను స‌మాజానికి అందిచ్చిన దార్శ‌నికుడాయ‌న‌. అందుకే ఆ హాస్ట‌ల్ వార్షికోత్స‌వానికి ముఖ్య అతిథిగా వ‌చ్చిన రాజా బ‌హ‌దుర్ వెంక‌ట్రాం రెడ్డి అక్క‌డికి వ‌చ్చిన జ‌న సందోహాన్ని చూసి ఆశ్చ‌ర‌చ‌కితుడై విష‌యం తెలుసుకుని ‘భిక్షం మాంగా ధ‌ర్మ్ కియా ఇన్‌కా నామ్ ధ‌ర్మ్‌భిక్షు హై’ అని సంభోదించారు. అప్ప‌టివ‌ర‌కు బొమ్మ‌గాని భిక్షంగా ఉన్న ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ధ‌ర్మ‌భిక్షం అని పిల‌వ‌డం ప్రారంభిచార‌ట‌. ఆ పేరు ఆరు ద‌శాబ్ధాల త‌ర్వాత ఒక అద్భుత‌, అరుదైన‌, అసాదార‌ణ‌, అవ్య‌క్త‌మైన‌, అపురూప‌-అస‌మాన వ్య‌క్తిత్వానికి రూప‌మైంది.
మొద‌ట జాతీయ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌గా, ఆ త‌ర్వాత ఆర్య స‌మాజ్ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేసిన ఆయ‌నలోని చైత‌న్యం, ప్ర‌శ్నించేత‌త్వం, తిరుగుబాటుత‌త్వం అక్క‌డ ఇమ‌డ‌నీయ‌లేదు. ఆయ‌న స‌హ‌జ‌శీల స్వ‌భావం ఆంధ్ర మ‌హాస‌భ వైపు అడుగులు వేయించింది. ఆంధ్ర మ‌హాస‌భ కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తూనే 1942లో క‌మ్యూనిస్టు పార్టీల చేరాడు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కోసం రాజ‌కీయ‌, సైద్ధాంతిక వైరుధ్యాల‌ను ప‌క్క‌న‌బెట్టి సంఘ‌టిత‌మై పోరాడిన‌ట్లుగానే… ఆనాడు నిజాం దాష్టీకాన్ని తుది ముట్టించేందుకు ఆంధ్ర మ‌హాస‌భ నాయ‌క‌త్వంలో స‌బ్బ‌న్న‌వ‌ర్గాలు మ‌హ‌త్త‌ర తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చాయి. పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య, రావి నారాయ‌ణ రెడ్డి, భీం రెడ్డి న‌ర్సింహ‌రెడ్డి, దేవుల‌ప‌ల్లి వెంక‌టేశ్వ‌ర రావు, చాక‌లి ఐల‌మ్మ‌, వ‌ట్టికోట ఆళ్వార్ స్వామి, దాశ‌ర‌థి కృష్ణ‌మాచారి వంటి యోధానుయోధుల‌తో క‌లిసి న‌డిచాడు. తెలంగాణ విముక్తికోపం పోరుస‌ల్పిన‌ ఎంద‌రో భార్యాబిడ్డ‌లు, ఆస్తులు, వ్య‌క్తిగ‌త జీవితాల‌ను త్య‌జించి ఉద్య‌మాల‌కు జీవితాన్ని అర్పించిన సంద‌ర్భ‌మ‌ది. ఉద్య‌మ అవ‌స‌రాల రీత్యా యువ‌కులు కొంత‌కాలం పెళ్లి చేసుకోవద్ద‌న్న సూచ‌న‌ను అంద‌రి క‌న్న ముందుగా ఆహ్వానించి, ఆచ‌రించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిన మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం ఆయ‌నిది. ఆయ‌న ఆద‌ర్శం, ఆచ‌ర‌ణ ఉద్య‌మానికే గ‌ర్వ‌కార‌ణంగా, గీటురాయిగా నిలిచింది. నూనూగు మీసాల య‌వ్వ‌నంలో పుణికి పుచ్చుకుని, తుది శ్వాస విడిచేంత వ‌ర‌కు జీవితాంతం ఆ విలువ‌ల‌ను ఆచ‌రించి వాటికే వ‌న్నె తెచ్చిన‌ నిఖార్సైన వ్య‌క్తిత్వం ఆయ‌నిది. వామ‌ప‌క్ష, విప్ల‌వోద్య‌మాల‌లోనూ నేటికీ ఆ విలువ‌లే ప్రామాణికంగా ఉన్నాయి.

ఆయ‌న జీవిత‌మంతా ఆటుపోట్లు, అరెస్టులు, అజ్ఞాతం, అర‌ణ్య‌వాసాలే. జ‌న‌గామ తాలూకా విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్య‌తిరేకపోరాటానికి సంఘీభావంగా సూర్యాపేట‌లో సార్వ‌త్రిక స‌మ్మె చేయించినందుకు ఆయ‌న‌పై నిజాం ప్ర‌భుత్వం 1946లో అరెస్టు వారెంట్ జారీ చేయ‌డంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయ‌న్ను ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తిగా భావించిన నిజాం ప్ర‌భుత్వం వెంటాడివేటాడి 1948లో అరెస్టుచేయ‌డంతో… న‌ల్ల‌గొండ‌, చంచ‌ల్‌గూడ‌, గుల్బ‌ర్గా, ఔరంగాబాద్ జైళ్ల‌లో ఐదున్న‌ర సంవ‌త్స‌రాల పాటు క‌ఠిన‌కారాగార శిక్ష‌ను అనుభ‌వించారు. ఈ క్ర‌మంలోనే ఉవ్వెత్తున ఎనిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం రాచ‌రికాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించింది. హైద‌రాబాద్ సంస్థానం భార‌త్ యూనియ‌న్‌లో విలీన‌మైంది. ఈ క్ర‌మంలో 1952లో జ‌రిగిన తొలిసార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పీపుల్స్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌(పిడిఎఫ్) అభ్య‌ర్థిగా పోటీచేసి, అంద‌రికంటే ఎక్కువ మెజారిటీతో తొలి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1957లో రెండోసారి, ఆ త‌ర్వాత 1962లో న‌ల్ల‌గొండ అసెంబ్లీ స్థానానికి శాస‌న స‌భ్యుడిగా… 1991, 1996లో న‌ల్ల‌గొండ లోక్‌స‌భ స్థానానికి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా బ్ర‌హ్మండ‌మైన మెజారిటీతో గెలుపొందారు.

అదే స‌మ‌యంలో త‌న కుల వృత్తి అయిన క‌ల్లుగీత కార్మికుల ద‌య‌నీయ స్థితిన గ్ర‌హించిన ఆయ‌న వారి హ‌క్కులు, వృత్తి ప‌రిర‌క్ష‌ణ‌కోసం 1956లోనే గీత ప‌నివారల సంఘం ఏర్పాటుచేసి, ల‌క్ష‌లాది మంది క‌ల్లుగీత కార్మికుల‌ను కూడ‌గ‌ట్టి దేశంలోనే వృత్తి పోరాటాల‌కు ఆధ్యుడయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్నో వృత్తిదారుల పోరాటాల‌కు మార్గ‌ద‌ర్శి అయ్యాడు. భూస్వాముల ఆగ‌డాల నుంచి క‌ల్లు గీత ప‌నివార‌ల భ్ర‌ద‌త కోసం ‘గీసే వాడిదే చెట్టు’ నినాదంతో జాతీయ స్థాయిలో నిర్దిష్ట విధాన రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్య‌భూమిక పోషించి.. క‌ల్లు గీత కార్మికుల రెండు క‌ళ్లు అయ్యాడు. దేశంలోనే గీత‌కార్మికుల బ‌తుకు భ‌గ‌వ‌ధ్గీతాచార్యుడయ్యాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడిగా, ప్ర‌జా పోరాటాల నాయ‌కుడిగా, లోక్‌స‌భ స‌భ్యుడిగా, శాస‌న స‌భ్యుడిగానూ ప్ర‌జ‌ల వాణి వినిపించి త‌న ధ‌ర్మాన్ని నిఖార్సుగా నిర్వ‌ర్తించి సార్థ‌క‌నామ‌ధేయుడ‌య్యాడు. నూనూగు మీసాల వ‌య‌సులోనే క‌ర్క‌శుడైన నిజాం రాచ‌రికాన్ని ధిక్క‌రించడంతో మొద‌లైన జీవిత ప్ర‌స్థానం 2011, మార్చి26న తుది శ్వాస విడిచేంత వ‌ర‌కు ఏడు ద‌శాబ్ధాల పాటు ప్ర‌జా ఉద్య‌మాలే ఉచ్ఛ్వాస‌, నిశ్వాస‌లుగా సాగింది. ‘పుట్టుక ఒక‌టే త‌న‌ది – బ‌తుకంతా ప్ర‌జ‌ల‌ది… జీవ‌మొక‌టే త‌న‌ది – జీవితం ఉద్య‌మాల‌ది… అన్యాయం ఎదురైతే నిప్పులు కురిసిన క‌న్నులు… రాచ‌కొండ గుట్ట‌ల‌పై తుప్పులు న‌రికిన చేతులు… నిజాయితీకి నిలువెత్తు రూపం… పోరాట‌పు అనుభ‌వాలు పండిన త‌ల వెండికొండ‌- నేల‌పై న‌డుస్తున్న ఆర‌డ‌గుల ఎర్ర‌జెండా… స‌మ‌స‌మాజ ల‌క్ష్యం-ఎరుపెక్కిన వృక్షం… పీడిత జ‌న‌ప‌క్షం బొమ్మ‌గాని ధ‌ర్మ‌బిక్షం…’ అంటూ ప్ర‌జాక‌వి సుద్దాల అశోక్ తేజ నివాళుల‌ర్చించారు. ఆ మ‌హ‌నీయుడి జీవితం ఈ త‌రం ఉద్య‌మ‌కారులు, సామాజిక జీవితంలో ఉండేవారికి ఆచ‌ర‌ణీయం.
(ఈ రోజు… మార్చి26 నాడు ఆయ‌న వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆ మ‌హానీయుడికి వంద‌నాల‌తో)
* * *

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ)
Email: palleravi@live.com

గురుకులాతో సామాజిక విద్యా విప్లవం

           జనాభాలో సగానికి ఉన్న కోట్లాది మంది వెనకబడిన తరగతు (బీసి) ప్రజ జీవితాల్లో మెగు సాగుతున్నది.ఇన్న్లేుగా కొందరి చుట్టు కేంద్రీక ృతమైన అభివ ృద్ధి ఫలాు, ఉన్నతావకాశాు స్వరాష్ట్రలో అన్ని వర్గాకు సమానంగా అందాన్నదే సంక్పం. ఆ సంక్పసిద్ది కోసం ఆ వర్గాకు ఒకవైపున సంక్షేమం అభివ ృద్ధి కార్యక్రమా ద్వారా స్వ్పకాలికంగా చేయుతనిస్తూనే, మరొవైపున-దీరెకాలికంగా ఆ వర్గా ప్రజ వికాసం కార్యరంగానికి శ్రీకారం చుట్టింది.అందుకొసం బీసీ కులా సంక్షేమం కోసం 2017-18 వార్షిక బడ్జేట్‌లో రూ.5,070 కోట్లు కేటాయించింది. ప్రపంచీకరన పరిస్తితుకు తోడుగా ఉమ్మడి ఆంధ్రప్రధేష్‌ పాకు కారణంగా కునారిుతున్న చేతివ ృత్తుకు పునర్జీవనం పోయడానికి అవసరమైన సూక్ష్మస్తాయి ప్రణాలికూ రుపొందించుకోవడం.. ఆ కుటుంబాకు చెందిన ప్లికు కార్పోరేట్‌ విద్యనందించేందుకు కనువిని ఎరుగని రీతిలో పెద్దసంఖ్యలో గురుకు విద్యా సంస్థు నెక్పొడం…తెంగాణ రాష్ట్రం ఎర్పడక ముందు ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుకు మాత్రమే పరిమితమైన ఓవర్సీస్‌ స్కార్‌షిప్‌ పథకాన్ని విదేషాలో చదువుకునే బీసీ విద్యార్ధుకు సైతం వర్తింపజేసి మహత్మా జ్యోతిబా పూలే బీసి ఓవర్సీస్‌ విద్యనిది ఏర్పాటు తదితర కార్యక్రమ ద్వార విద్యా విస్త ృతి ద్వార శరవేగంగా పనిచేస్తున్నది. అందులో ముఖ్యంగా బీసి విద్యార్థు సైతం ప్రపంచస్తాయి పోటీని తట్టుకునే విధంగా ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించేందుకు ఉద్దేశించిన గురుకులాతో విద్యా వ్యవస్థలో సమూ మార్పుకు దొహద్కారి అవుతుంది.

         దేశంలో ఎక్కడ లేనివిధంగా కేజి టు పీజీ విద్యావిధానంలో భాగంగా రాష్త్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చొప్పున 119(56 బాురు, 63 బాలికు) గురుకు పాఠశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది తెంగాణ ప్రభుత్వం. ఆ గురుకులాన్నింటినీ ఓకే రోజున ఈ నె 12 వ తేదిన లాంఛనంగా ప్రారంభించి విద్యారంగం లో నుతన శకానికి నాంది పలికింది. వీటి ద్వారా 2017-18 విద్యా సంవత్సరంలో 28,520 విద్యార్థిని,విద్యార్థుకు సమగ్ర వసతు, పౌషి‘కాహరం, ఉపాద్యాయు నిరంతర పర్యవేక్షణలో ఉన్నత ప్రమాణాలో కూడిన ఆంగ్లమాధ్యమంలొ నాణ్యమైన విద్య అందుతుంది. వచ్చే నాుగేళ్ళలో ఆ విద్యార్థుకు 76 వేకు చేరుతుంది. నాుగేళ్ళ తర్వాత గురుకు పాఠశాలు ఇంటర్మీడియట్‌ విద్యనందించే కళాశాలుగా అప్‌గ్రేడ్‌ అవుతాయి. ఇది రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పునకు ఎంతగానో దోహదపడుతుండంలో ఎలాంటి సందేహం లేదు. వెనకబడిన కులా(బీసీ) ప్రజు విద్యా విషయకంగా ముందడుగు వేయటానికి ఈ గురుకులాలి మహత్తర సాధనంగా పనిచేస్తాయి. మరి ముఖ్యంగా- ఇప్పటికీ సమాజంలో తమ ఉనికిని చాటుకోలేని స్థితిలో ఉన్న అత్యంత వెనకబడిన కులాు… బుడిగ జంగాు, బుడ బుక్క, పూసలి, దాసరి,గంగిరెద్దు, కాటికాపరి, పిచ్చుక గుంట్ల(వంశరాజ్‌), బాసంతు,పెద్దమ్మల్లోు, మందెచ్చు, తదితర కులాకు చెందిన క్షలాది మంది సంచార జాతుగా, ఆశ్రిత కులాుగా, యాచకుగా అత్యంత దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్న విషయం అత్యంత దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ జాతునకు విద్యా గంధం అద్దటం ద్వారా ఆ వర్గా సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆశించినట్లు బీసీ గురుకులాు అద్బుతంగా ఉపకరిస్తాయి. 1970వ సంక్షేమ హస్టళ్ల ప్రవేవంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గా ప్లిు బడిమెట్లు ఎక్కడం మొదలైంది. ఆ విధంగా విద్యావంతులైన వారే విద్యా, ఉద్యోగ, వ్యాపార, తదితర రంగాల్లో స్థిరపడిన తొలితరం ఏమాత్రం ప్రమాణాు లేని సంక్షేమ హస్టళ్ల అంతమంచి ఫలితాను సాధించగలిగినపుడు, అత్యధునిక ప్రమాణా, వసతుతో కూడిన గురుకులాు ఖచ్చితంగా అద్ధుతమైన ఫలితాు ఇస్తాయనడంలో సందేహం లేదు.

అదేక్రమంలో మాజీప్రధాని స్వర్గీయ పి.వి. నర్సింహరావు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలో మూడు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్థాపించి గుయి విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు నాుగున్నర దశాబ్దాుగా ఎందరో ప్రతిభావంతు, ఉన్నత విద్యావంతు, ఐఏఎస్‌, ఐపిఎస్‌, గ్రూప్‌`1 అధికాయి, డాక్టర్లు, ఇంజనీర్లను తొగు సమాజానికి అందించిన సర్వే గురుకు పాఠశా ఆ మూడిరటిలో ఒకటి. అవి అందించిన అద్భుత ఫలితా ప్రేరణతోనే రెసిడెన్షియల్‌ జూనియర్‌, డిగ్రీ కాలేజీు, స్కూల్స్‌ విస్తృతంగా ఆవిర్భవించాయి. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాసంస్థ స్థాపనకూ ఇవే ప్రేరణిచ్చాయన్నది గమనించాలి. ఎస్సీ, ఎస్స్టీ, బీసీ వర్గా ప్రజు ఉన్నత విద్యావంతులై సమాజంలోని అన్ని రంగాల్లో చొచ్చుకునిపోవటానికి గురుకు విద్యావ్యవస్థ ఒక మహత్తర సాధనంగా పనిచేసింది. అక్కడ సమకాలీన పోటీ పరిస్థితును తట్టుకునే విధంగా ఉన్నత ప్రమాణాతో కూడిన విద్య అందివ్వడమే అందుకు కారణం ` మహనీయుడు పూలే “The type of Education which can be a powerful device for eradication of social evils”   సరిగ్గా అదే విషయం చెబుతాడు.

సమాజంలో దోపిడి, వివక్షచ, అణచివేతకు గురవుతున్న బడుగు బతుకు మార్చగలిగే శక్తివంతమైన సాధనం చదువోక్కటేనన్నది మహత్మా జోతిబా పూలే బమైన విశ్వాసం ` చదువు సామాజిక విప్లవకాయి పూలే, డా॥ బి. ఆర్‌. అంభేద్కర్‌, మహనీయు ఆశయం. అందుకోసం ఆ మహనీయు తమ జీవితాంతం పరితపించారు. ఒక వ్యక్త లేదా సమూహం (జాతి)లో ఎంత శక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ, అందుకు తగిన వనయి, అంతర్లీనంగా ఉండే ఆ శక్తి, సామర్ధ్యాు సమాజ వికాసానికి ఉపయోగపడాంటే వనయి, అవకాశాు చాలా ముఖ్కం ఇంతకాంగా పాకు అణగారిన వర్గాకు ఆ అవకాశాు కల్పించకుండా అణచివేశాయి. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బడుగు, బహీన వర్గాకు అవకాశాు కల్సిరాని, వారిని అద్భుతమైన మానవ వనయిగా భావితరాకు అందివ్వాన్న సంక్పంతో కేసీఆర్‌ గురుకులాను విస్తృతంగా నెక్పొరు. అందివచ్చే ఆ అవకాశాను సంపూర్ణంగా వినియోగించుకోవాలి. ఆధిపత్య వర్గాు నిర్మించే ఆధిపత్య గోడను బద్ధు కొట్టగలిగే శక్తి యుక్తును సంతరింపచేసుకోవాలి. తమను తాము అన్ని విధాుగా శక్తిమంతుగా తీర్చిదిద్దుకునేందుకు ఆయుధంగా మచుకోవాలి. గురుకులాను ఆ దిశలో పనిచేయించడం ద్వారా వాటినీ పటిష్టపరచడం అవసరం బడుగు బహీన వర్గా ప్రజు సగర్వంగా, సాధికారికంగా జీవించడానికి దోహదకారి కాగవు.

పల్లె రవి కుమార్‌
(ఉపాధ్యక్షులు)
తెంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

…………..
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు.ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం.
——————–

ప్రజలే కేంద్రంగా వారి సమస్యలు ఇతివృత్తంగా, సమాజ వికాసమే లక్ష్యంగా పాలన సాగాలి అన్న దార్శనికతతో పాలనకు మానవీయ కోణా న్ని జోడించి సమాజంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, వికాసానికి దోహదపడే ప్రణాళికలు రూపొందించుకున్నది తెలంగాణ. అందులో భాగంగానే తెలంగాణ కోస మే తెలంగాణ జర్నలిస్టులు అనే సైద్ధాంతిక భూమికతో రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పనిచేసిన వేలాదిమంది తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఉద్యమకాలంలో ఉద్యమసారథిగా నాడు ఇచ్చి న హామీని నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడాలేని విధం గా జర్నలిస్టులు, వారి కుటుంబాల సంక్షేమం, అభ్యున్నతి, ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పలుకుబడి గల కొందరు మినహాయిస్తే సగటు జర్నలిస్టుల సంక్షేమానికి ఒక దశ-దిశను నిర్ధేశించింది కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం. సామాన్య జర్నలిస్టు దుఃఖాన్ని తీర్చేందుకు దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో నూత న ఒరవడికి శ్రీకారం చుట్టింది. వంద కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల మంజూరుకు నిర్దిష్ట హామీ. వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కూతురు వివాహానికి 3 లక్షల ఆర్థిక సాయం తదితరాలు ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఎవరైనా జర్నలిస్టు కు ఆకస్మికంగా ఏదైనా ఆపద వస్తే నేనున్నానంటూ ఓ పెద్దన్నలా ఆపన్న హస్తం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటిన నేత కేసీఆర్.

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 10 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. దానినే టీఆర్‌ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. అధికార పగ్గా లు చేపట్టగానే ఇచ్చిన హామీకి పది రెట్లు అంటే 100 కోట్లతో సంక్షేమ నిధికి సంకల్పించి ఇప్పటికే 60 కోట్లు విడుదల చేసి జర్నలిస్టు సమాజం పట్ల తనకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల జర్నలిస్టుల కోసం గత పాలకులు కేవలం కోటి రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఆ కోటి రూపాయల కోసం జర్నలిస్టు సమాజం ఎన్ని వీధి పోరాటాలు చేయాల్సి వచ్చిందో మరిచిపోలేదు. ఆ అత్తెసరు నిధితో జర్నలిస్టులకు జరిగిన మేలు ఎంత? అటువంటిది తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటుచేసింది నిజం కాదా? ఉమ్మడి పాలకుల కేటయింపులకు, దీనికి ఏమైన పోలిక ఉన్నదా? రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధిపై వచ్చిన వడ్డీతో వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టు కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు, బాధిత కుటుంబ పోషణా ర్థం నెలకు 3 వేల చొప్పున ఐదేండ్ల పాటు పింఛన్, అలాగే ఆ కుటుంబంలో పది లోపు చదువుకునే పిల్లలున్నట్లయితే వారికి నెలకు వెయ్యి చొప్పున వారు పదవ తరగతి పూర్తిచేసేంత వరకూ ఆర్థికసాయం సంక్షేమ నిధి నుంచి అందుతుంది.

దీనికితోడుగా మరణించిన జర్నలిస్టు కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికి 3 లక్షలను సీఎం సహాయనిధి నుంచి ఇవ్వడానికి కేసీఆర్ సంకల్పించారు. తీవ్ర అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు కుటుంబానికి యాభై వేలు సంక్షేమ నిధి నుంచి ఇచ్చే వెసులుబాటు కలిపించారు. 2017 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదిన వేడు క సందర్భంగా శ్రీకారం చుట్టిన సంక్షేమ నిధి నుంచి ఇప్పటివరకు సుమా రు కోటి 25 లక్షలకు పైగా.. చనిపోయిన వంద మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష చొప్పున ఇవ్వడమే కాకుండా వారికి నెలకు 3 వేల చొప్పున పింఛన్ చెల్లించే ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలైంది. అలాగే మరో 32 మంది పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు 50 వేల చొప్పున ఇచ్చా రు. జర్నలిస్టు కుటుంబాలకు ఇంతగా భరోసా కల్పించిన ఘనత మన రాష్ర్టానిదే. 20 ఏండ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన వారికి సమీప భవిష్యత్‌లో పింఛన్ స్కీం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

హెల్త్‌కార్డుల విషయానికొస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల కంట్రిబ్యూషన్‌తో బీమా ఆధారితంగా గరిష్ఠంగా లక్ష పరిమితి ఉండేది. 2012 తర్వాత అది కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులతో సమానంగా ఒక పైసా చెల్లించనవసరం లేకుండానే జర్నలిస్టులకు నగదురహిత హెల్త్‌కార్డుల స్కీంకు శ్రీకారం చుట్టింది. అక్రిడిటేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులకు దీన్ని వర్తింపజేసింది. దీనిద్వారా జర్నలిస్టుల భార్యా పిల్లలకు, తల్లిదండ్రులకు అపరిమిత కార్పొరేట్ వైద్యసాయం అందుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డు లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,033 మంది జర్నలిస్టులకు హెల్త్ కార్డులను సూత్రప్రాయంగా మంజూరు చేసింది. వారికి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు చేరాయి. వారిలో 4,288 మందికి పైగా హెల్త్‌కార్డులు జారీ అయ్యాయి. విధివిధానాలు రూపకల్ప న కారణంగా కానీ, కార్పొరేట్ దవాఖానలతో ప్రభుత్వ ఒప్పందాల కారణంగా కానీ హెల్త్‌కార్డుల జారీలో కొంత జాప్యం జరిగిందన్న మాట వాస్తవం. ఈ సమయంలో ఏ జర్నలిస్టుకైనా అత్యవసర వైద్య సదుపాయం అవసరమైనట్లయితే సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం.

దేశంలోనే తొలిసారిగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల కార్డులను ఇచ్చిన ఘనత కూడా తెలంగాణదే. రాష్ట్రవాప్తంగా ఇప్పటివరకు సుమారు 14 వేల మందికి కార్డులు జారీ కాగా, మిగిలిన వారికి జారీచేసే ప్రకియ కొనసాగుతున్నది. హైదరాబాద్ కమిషనరేట్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 2,400 మందికి కార్డులు ఇవ్వగా, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఆ సంఖ్య 2800. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్‌లో ని ఇళ్ల స్థలాల సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఒక కొలిక్కి వచ్చింది. కోర్టు వివాదం ముగిసిన వెంటనే హైదరాబాద్‌లోని సుమారు 3 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతు న్నది. అదేవిధంగా, గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి సూత్రప్రాయంగా ఒప్పించుకోగలిగాం.

దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా జర్నలిస్టుల సంక్షేమంలో మన రాష్ట్రం ముందున్నది. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇప్పటి వరకూ దేశంలోనే ఏ ప్రభుత్వానికి జర్నలిస్టుల సంక్షేమం ఓ అజెండానే కాదు. కానీ ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అజెండాలో జర్నలిస్టు సంక్షేమం ఒక ప్రాధాన్య అంశంగా మారిందనే విషయాన్ని గుర్తెరుగాలి. వారి సంక్షేమం కోసం ఒక దశ-దిశను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఇది తెలంగాణలోని జర్నలిస్టులకు ఒక భరోసా కల్పించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం ద్వారా ఇన్నేళ్లుగా ఎవరికీ పట్టకుండా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించుకుందాం.

పల్లె రవికుమార్
(వ్యాసకర్త: టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు)

జర్నలిస్టులకు ఒక భరోసా

రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్షేమం కోసం పలు కార్య్రకమాలు చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు కుటుంబాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఇటీవలి కాలంలో జర్నలిస్టుల సమస్యలపై గతం లో ఎన్నడూ లేనివిధంగా చర్చ జరుగుతున్నది. వివిధ రాజకీయపక్షాలు పోటీపడి జర్నలిస్టుల మేలు కోరుతుండటం హర్షణీయం. ఇది పక్కనబెట్టి వాస్తవ పరిస్థితిని నిర్మొహమాటంగా ఒక్కసారి పరిశీలిస్తే.. నిత్యం సమాజంలోని వివిధవర్గాల హక్కులు, రక్ష ణ, భద్రత, సంక్షేమం కోసం గొంతుకగా పనిచేసే జర్నలిస్టులకు అవేవీ లేవన్నది అక్షర సత్యం. అత్యంత దయనీయంగా ఉండే జర్నలిస్టుల జీవ న స్థితిగతులు, దుర్భరస్థితి ఏ రాజకీయపక్షానికి గానీ, సామాజిక సంస్థలకు గానీ ఏనాడూ ప్రాధాన్యతాంశంగా కనిపించలేదు. ఈ వర్గం ఓటుబ్యాంకు కాకపోవడమే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరన్లే దు. పర్యవసానంగా ఇండియన్ వర్కింగ్ జర్నలిస్టు యాక్ట్-1955లో నిర్దేశించినట్లుగా కనీస వేతనం, ఈఎస్‌ఐ, ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగ భద్రత తదితర రక్షణలన్నీ జర్నలిస్టుకు అందని ద్రాక్ష.

జర్నలిస్టులు వృత్తి రీత్యా గాంభీర్యంగా ఉన్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితం దుర్భరం. ఈ విషయాన్ని అలా పక్కనబెడితే.. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న సైద్ధాంతిక భూమికతో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఉద్యమంతో మమేకమై అగ్రభాగాన నిలబడ్డారు. ఈ క్రమంలో అనేక ఒత్తిళ్లు, వృత్తిపరమైన పరిమితులను సైతం లెక్కచేయకుం డా లక్ష్యసాధన కోసం పధ్నాలుగేళ్ల పాటు నిక్కచ్చిగా పనిచేశారు. అదే నేటి బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ తెలంగాణ జర్నలిస్టుల పట్ల తన బాధ్యత నెరవేర్చేలా చేసిం ది. అందుకే జర్నలిస్టుల సంక్షేమం, అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యాచరణను రూపొందించింది. వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. ఒకటి- జర్నలిస్టుల సంక్షేమ నిధి. రెండోది- వర్కింగ్ జర్నలిస్టు అండ్ రిటైర్డ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం. అందులో భాగంగా వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టుల, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ స్కీంను ప్రవేశపెట్టింది. అందుకోసం జీవో 64 విడుదల చేసింది. జర్నలిస్టు హెల్త్ స్కీం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రాజధానిలోని ఎడిటర్ నుంచి మండలస్థాయిలో పనిచేసే గ్రామీణ విలేకరి వరకు సుమారు 20 వేల మంది జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వడం ద్వారా సుమారు ఒక లక్ష మందికి ఆరోగ్య భద్రత కల్పించనుంది.

జర్నలిస్టుల సంక్షేమం, అభ్యున్నతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట విధానం గానీ, మార్గదర్శకాలు గానీ ప్రాథమికంగా లేకపోవడం మూలంగా కార్యాచరణలో జాప్యం చోటుచేసుకున్నది. లబ్ధిదారుల ఎంపిక, అందుకు అవసరమైన విధానాల రూపకల్పన, కార్పొరేట్ దవాఖానలతో ఒప్పందం.. తదితర అంశాల్లో ఉత్పన్నమయ్యే అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమించాల్సి ఉన్నది. ఇటీవల 14 కార్పొరేట్ దవాఖానలతో కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) అవుట్ పేషంట్ (ఓపీ) సేవల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో కూడా వెల్‌నెస్ సెంటర్ నెలకొల్పడంతో దాదాపుగా అన్ని సమస్యలు కొలిక్కివచ్చినట్లే. దీంతో సుమారు ఇరువై వేల మంది జర్నలిస్టుల కుటుంబాలతో పాటు 8,73,253 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కు.. 2,71,072 మంది పింఛనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించినట్లే.

ఓపీ సేవల కోసం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని ఒక వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయగా.. రెండోదశలో నగరంలోని వనస్థలిపురం, కూకట్‌పల్లి, ఈసీఐఎల్, చార్మినార్ వద్ద వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆ తర్వాత జిల్లాకొకటి ఏర్పాటు చేయడం ద్వారా జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాచరణ రూపొందించింది. వెల్‌నెస్ సెంటర్ల ద్వారా 1885 రకాల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందించడంతో పాటు 200 రకాల బ్రాండెడ్ మందులు అందజేస్తారు. ఇంకా హెల్త్‌కార్డులు జారీకానీ అర్హులైన జర్నలిస్టులకు కూడా కార్డులిచ్చే ప్రకియ వీలైనంత త్వరలో పూర్తిచేసేందుకు సమాచార, పౌరసంబంధాలశాఖ, వైద్యారోగ్య శాఖలు నిర్దిష్ట కార్యాచరణ చేపట్టింది.

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన వెంటనే 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకువచ్చింది. ఈ మేరకు ఇప్పటికే 20 కోట్ల రూపాయల కార్పస్‌ఫండ్‌ను జమచేసింది కూడా. ఈ నిధిపై యేటా వచ్చే వడ్డీతో.. ఆకస్మికంగా మరణించే జర్నలిస్టు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా ఒక లక్షరూపాయలు, కుటుంబ పోషణకు ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున ఐదేళ్లపాటు. సదరు జర్నలిస్టు పిల్లలు పదవతరగతి చదివేంతవరకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆ కుటుంబానికి అదనంగా ఆర్థిక సహాయం అదేవిధంగా ఎవరైనా జర్నలిస్టు అనారోగ్యం పాలై పనిచేయలేని స్థితిలో ఉన్నైట్లెతే, తక్షణ ఉపశమనంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మేరకు ఇప్పటికే 59 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ సిద్ధం చేసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే గ్రామీణ జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఆరోగ్యభద్రత, సంక్షేమం కోసం పలు కార్య్రకమాలు చేపట్ట డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు కుటుంబాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నదనడంలో సందేహం లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాలు ఆయా రాష్ర్టాలకు మార్గదర్శి కానున్నాయన్నది ముమ్మాటికి నిజం.
(వ్యాసకర్త: తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు)

స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌..! -ప‌ల్లె ర‌వి కుమార్‌

స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోతున్న వేలాది టీఎంసీల గోదావ‌రి జ‌లాల‌ను వినియోగించుకోవ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ఒక చారిత్రాత్మ‌కం. రెండు రాష్ట్రాల ఆధునిక చ‌రిత్ర‌లో ఇదొక మ‌హ‌త్త‌ర ఘ‌ట్టం. ఐదున్న‌ర ద‌శాబ్ధాలుగా సాగిన తీవ్ర నిర్ల‌క్ష్యం, అణ‌చివేత‌, దోపిడి, వివ‌క్ష‌ల మూలంగా తెలంగాణ సాగునీటి రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్ట‌బ‌డింది. దీనికి తోడుగా నిత్యం క‌రువు, కాట‌కాలు.. ప‌ర్య‌వ‌సానంగా అప్పులు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో రైతాంగం త‌ల్ల‌డిల్లుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రాల‌తో ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి విడ‌నాడి, ప‌ర‌స్ప‌ర స‌హ‌కార దోర‌ణితో చ‌ర్చ‌లు-సంప్ర‌దింపుల ద్వారా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టులను స‌త్వ‌ర‌మే పూర్తి చేసుకోవ‌డానికి మార్గం సుగ‌మం చేసింది. నెర్రెలు బారిన తెలంగాణ బీడు భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు, సాగునీటి రంగం ద‌శ‌-దిశ‌ను మార్చే అపురూప‌మైన ఘ‌ట్టం మార్చి8న ముంబై వేదిక‌గా ఆవిష్కృత‌మైంది. నీటికోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదీర్ఘ పోరాటాలు జ‌రుగుతున్న ఈ రోజుల్లో రెండు రాష్ట్రాలు… చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ఒప్పందం కుదుర్చుకోవ‌డం ముమ్మాటికీ అద్వితీయ‌మే. త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో దేశంలో 36 రాజ‌కీయ పార్టీల‌ను ఒప్పించి, ఆరు ద‌శాబ్ధాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న కోట్లాది మంది తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసిన ఉద్య‌మ నేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారు- ఒక ముఖ్య‌మంత్రిగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను సునాయ‌సంగా నెల‌కొల్ప‌గ‌లిగారు. దీంతో మ‌హారాష్ట్ర‌, తెలంగాణల మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా నెల‌కొన్న‌జ‌ల‌వివాదం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకున్న‌ట్ల‌యింది. ఈ విష‌యంలో ప‌ట్టువిడుపుల‌తో వ్య‌వ‌హ‌రించి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించ‌డంలో కేసీఆర్ ప్ర‌ద‌ర్శించిన రాజ‌నీతిజ్ఞ‌త గొప్ప‌ది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో గోదావ‌రి న‌దిపై ప్ర‌తిపాదించిన ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా… అప్ప‌టి మ‌హారాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆందోళ‌న చేసిన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్ స్వ‌యంగా ”మా అభ్యంత‌రాల‌న్నింటినీ కేసీఆర్ గారు క‌న్విన్స్ చేసి మ‌మ్మ‌ల్ని ఒప్పించారు” అని చెప్ప‌డం దాన్ని తెలియ‌జేస్తున్న‌ది. ఉద్య‌మ నాయ‌కుడు ప‌రిపాల‌కుడైతే ఎలా ఉంటుంద‌న్న విష‌యం దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

రెండు రాష్ట్రాల‌కు మేలు చేసే విధంగా జ‌రిగిన ఈ తాజా ఒప్పందం ప్ర‌కారం… తెలంగాణ ప్ర‌భుత్వం- లోయ‌ర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా చ‌నాకా-ప్రాణ‌హిత‌, కొరాట‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహ‌ట్టి, మేడిగ‌డ్డ‌ల వ‌ద్ద బ్యారేజీలు, అదేవిధంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం- లోయ‌ర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా రాజ‌పేట్‌, పెన్‌ప‌హ‌డ్ ల వ‌ద్ద బ్యారేజీలు నిర్మించుకుంటాయి.ఈ ఒప్పందం వ‌ల్ల రెండు రాష్ట్రాల దుర్భిక్ష ప్రాంతాలు గోదావ‌రి జ‌లాల‌తో స‌స్య‌శ్యామ‌లం కాబోతున్నాయి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసుకున్న‌ట్ల‌యితే ఉత్త‌ర తెలంగాణతో పాటు కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలోని ద‌క్షిణ తెలంగాణ జిల్లాల‌కు సైతం గోదావ‌రి జ‌లాల‌ను ఇవ్వ‌వ‌చ్చు.

పంతాలు, ప‌ట్టింపుల‌కు పోయినందు వ‌ల్లే కృష్ణా, గోదావ‌రి న‌దుల‌పై తెలంగాణ కోసం ప్ర‌తిపాదించిన ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. ఏ న‌ది ప‌రివాహ‌క ప్రాంతం కూడా ఒక్క రాష్ట్రానికే ప‌రిమితం కాక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం. ఒక్కో న‌ది రెండు, మూడు రాష్ట్రాల గుండా ప్ర‌వ‌హిస్తుండ‌టం మూలంగా ఆ న‌ది జ‌లాల‌పై ఆయా రాష్ట్రాల‌కు హ‌క్కులు సంక్ర‌మిస్తాయి. అలాగే తెలంగాణ‌లో ప్ర‌ధానంగా ఉన్న‌- కృష్ణా న‌ది జ‌లాల‌ను ఎగువ‌న ఉన్న క‌ర్నాట‌క‌, దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో క‌లిసి పంచుకోవాలి. గోదావ‌రి న‌ది జ‌లాల‌ను ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర‌, చ‌త్తీష్‌గ‌ఢ్‌, దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌తో పంచుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో నీటి పంపిణీ స‌మ‌స్య ఒక్క‌టే కాదు, ప్రాజెక్టుల నిర్మాణం వ‌ల్ల పొరుగు రాష్ట్రానికి చెందిన భూముల ముంపు స‌మ‌స్య కూడా. ఈ రెండు అంశాల‌ను ఆస‌రాగా చేసుకున్న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన సీమాంధ్ర‌,పెద్ద‌లు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌న‌డం అక్ష‌ర‌స‌త్యం. పొరుగు రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, చత్తీష్‌గ‌ఢ్‌ల‌తో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా కాకుండా- నీటి వాటా విష‌యంలోనైనా లేదా భూముల ముంపు విష‌యంలోనైనా వివాదాలు త‌లెత్తేట‌ట్లుగా తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్లు ప్ర‌తిపాదించి ఏండ్ల త‌ర‌బ‌డిగా అవి పూర్తికాకుండా వ్య‌వ‌హ‌రించార‌న్న‌ది చారిత్మ‌క వాస్త‌వం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి స‌రిహ‌ద్దుల్లో ఉండే తెలంగాణ ప్రాజెక్టుల విష‌యంలో పొరుగు రాష్ట్రాల‌తో త‌లెత్తే వివాదాలు చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుని ప్ర‌తిపాదిత ప్రాజెక్టులు స‌త్వ‌ర‌మే పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా, వివాదాల‌ను మ‌రింత జ‌ఠిలం చేసేందుకు ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొనేట‌ట్లు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకు అనుగుణంగా వంత పాడేందుకు సీమాంధ్ర పెద్ద‌లు తెలంగాణ‌లో త‌మ తాబేదార్ల‌ను త‌యారుచేసుకున్నారు. ఫ‌లితంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎగువ‌న‌, పొరుగు రాష్ట్రాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి న‌దుల‌పై ప్ర‌తిపాదిత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా స‌వ్యంగా ముందుకు సాగ‌కుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దాంతో తెలంగాణ‌కు దిగువ‌న ఉన్న సీమాంధ్ర ప్రాజెక్టులకు కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను య‌ధేచ్ఛ‌గా త‌ర‌లించుకుపోగ‌లిగారు. ఫ‌లితంగా నాలుగు ద‌శాబ్ధాలుగా తెలంగాణ‌లో ప్ర‌తిపాదిత సాగునీటి ప్రాజెక్టుల‌న్నీ పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. చిన్న‌పాటి ముంపు స‌మ‌స్య‌తో కృష్ణా న‌దిపై జూరాల ఇందిరా ప్రియ‌ద‌ర్శిని ప్రాజెక్టు ద‌శాబ్ధాలుగా నిర్దేశిత ల‌క్ష్యానికి అనుగుణంగా పూర్తికాలేదు. గోదావ‌రి న‌దిపై ద‌శాబ్ధాల క్రితం ప్ర‌తిపాదించిన ప్రాణహిత‌, ఇచ్చంప‌ల్లి, ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుల‌కు ఇంకా ఒక రూపం కూడా రాలేదు. కానీ అదేస‌మ‌యంలో సీమాంధ్ర‌కు సంబంధించిన ప్రాజెక్టులు, అక్ర‌మ ప్రాజెక్టులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్త‌య్యాయి. ప‌ర్య‌వ‌సానంగా బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు కేటాయించిన 299 టీఎంసీలు, గోదావ‌రి న‌దీ జ‌లాల్లో కేటాయించిన 950టీఎంసీల జ‌లాల్లో స‌గం కూడా వినియోగానికి రాలేదు. ఫ‌లితంగా తెలంగాణ‌లో 2కోట్ల 67ల‌క్ష‌ల ఎక‌రాల విస్తీర్ణంలో భూమి ఉండ‌గా- అందులో సాగుయోగ్యమైన భూమి 1కోటి 67ల‌క్ష‌ల ఎక‌రాలు, అందులో ప్రాజెక్టుల కింద కేవ‌లం 17ల‌క్ష‌ల ఎక‌రాలు, 40ల‌క్ష‌ల ఎక‌రాలు బావులు, బోరుబావులు కింద సాగ‌వుతున్న‌ది. మిగిలిన దాంట్లో రైతాంగానికి వ‌ర్షాధార‌మే కావ‌డంతో- వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్న‌ట్ల‌యితే రైతాంగం అత‌లాకుత‌లం కావ‌డం అనివార్య‌మైపోయింది. ప‌ర్య‌వ‌సానంగా తెలంగాణ‌లో శాశ్వ‌తంగా దుర్భిక్ష ప‌రిస్థితులు, ఫ్లోరైడ్‌, వెన‌క‌బాటు త‌నం, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు.

ఇదిలా ఉండ‌గా మ‌రోవైపున గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ‌కు 950టీఎంసీలు కేటాయిస్తే, ఇప్ప‌టివ‌ర‌కు 350టీఎంసీల‌కు మించి వాడుకోలేదు. స‌గ‌టున ప్ర‌తియేటా 2,423టీఎంసీల గోదావ‌రి జ‌లాలు వృథాగా స‌ముద్రంలో క‌లుస్తున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇంత‌కాలంగా తెలంగాణ ప్రాజెక్టుల ప‌ట్ల సీమాంధ్ర పాల‌కులు కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రే ఈ దుస్థితికి కార‌ణం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద‌శాబ్ధాలుగా కుట్ర‌లు, కుతంత్రాలకు బ‌లైన తెలంగాణ ప్రాజెక్టులు స్వీయ రాజ‌కీయ అస్థిత్వం, స్వీయ ప‌రిపాల‌న‌లోనూ విముక్తికి నోచుకోవ‌ద్దా? కుట్ర‌పూరిత వ్యూహాల నుంచి బ‌య‌ట‌ప‌డి స‌త్వ‌ర‌మే పూర్తి కావ‌ద్దా? ఇంకా సీమాంధ్ర నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే తెలంగాణ ప్రాజెక్టులు కునారిల్లాల్సిందేనా? ఏళ్ల త‌ర‌బ‌డి సీమాంధ్ర పెద్ద‌ల దుర్భుద్ధిని చేధించి ‘బ‌తుకుదాం-బ‌త‌క‌నిద్దాం’ అన్న నినాదంతో పొరుగు రాష్ట్రాల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధాల‌ను నెలకొల్పారు. రాజ‌కీయ పంతాలు, ప‌ట్టింపులకు పోకుండా విజ్ఞ‌త‌, బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి 156 మీట‌ర్ల ఎత్తుకు బ‌దులుగా, మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం కోరిన‌ట్లుగా 148మీట‌ర్ల ఎత్తుకు అంగీక‌రించ‌డం ఒక సాహ‌సోపేతం నిర్ణ‌యం. ఆ ఒప్పందంపై తెలంగాణ ముఖ్య‌మంత్రిగా సంత‌కం చేసిన‌ప్ప‌టికీ- ప‌దిహేనేళ్లుగా కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల నుంచి ఎదిగొచ్చిన ఉద్య‌మ నేత‌గా, తెలంగాణ క‌న్నీటి ఆర్థ్ర‌త, గుండె త‌డి తెలిసిన కేసీఆర్ గా ఆ నిర్ణ‌యం తీసుకోగ‌లిగారు. త‌న ప్ర‌జ‌ల‌ను మెప్పించుకోగ‌ల‌న‌న్న అచంఛ‌ల విశ్వాస‌మే ఆయ‌న‌తో ఆ ప‌ని చేయించింది. అందుకే ఆ ఒప్పందంపై కాంగ్రెస్‌, తెలుగు దేశం పార్టీ నేత‌ల వాద‌న‌ల‌ను తెలంగాణ ప్ర‌జానీకం ప‌ట్టించుకునే స్థితిలో లేదు.

ఇక ఇప్పుడు చేయాల్సింద‌ల్లా ఒక్క‌టే- ఏ ల‌క్ష్యంతోనైతే ఈ సాహ‌సోపేత ఒప్పందానికి ముందుకు సాగాడ, కేసీఆర్ అదే స్ఫూర్తి, ప‌ట్టుద‌లతో రెండుమూడేళ్ల‌లో ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌గ‌లిగిన‌ట్ల‌యితే గోదావ‌రి నీటితో ల‌క్ష‌లాది తెలంగాణ మాగాణి పారుతుంది. క‌రువు, కాట‌కాల‌తో నెర్రెలు బారిన తెలంగాణ నేల పుల‌కిస్తుంది. అపుడు తెలంగాణ ప్ర‌తి గుండె గొంతుక ”సుజ‌లాం… సుఫ‌లాం… తెలంగాణ స‌స్య‌శ్యామ‌లాం…” అని ప‌లుకుతుంది.
***

 

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌
Ph:+91-8008001233; email: palleravi@live.com

హైద‌రాబాద్‌పై పెత్త‌నం కోస‌మే ‘సెక్ష‌న్‌-8’ -ప‌ల్లె ర‌వి కుమార్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ట శాస‌న స‌భ ఈ నెల 16వ తేదీన 17 తీర్మానాల‌ను ఆమోదించింది. అందులో ప్ర‌ధానంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రం(గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌-జిహెచ్ఎంసీ) ప‌రిధిలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ అధికారం రెండు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డిగా ఉన్న గ‌వ‌ర్న‌ర్ కు అప్ప‌గిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014లో పొందుప‌ర్చిన సెక్ష‌న్‌-8 ప్ర‌యోగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ తీర్మానం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, అక్క‌డి రాజ‌కీయ పార్టీల పెద్ద‌లు తెలంగాణ రాష్ట్రం బిల్లు ఆమోదించిన‌ప్ప‌టి నుంచి ప‌లు సంద‌ర్భాల్లో సెక్ష‌న్‌-8 అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ, ఈసారి ఏకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయ‌డంతో ‘సెక్షన్‌-8’ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌దేప‌దే ఈ అంశం ఎందుకు తెరమీదికొస్తున్న‌ది? ఇంత‌కు సెక్ష‌న్‌-8 చెబుతున్న‌దేమిటి?  దాన్ని ప్ర‌యోగించాల్సినంత ప‌రిస్థితులు నెల‌కొన్నాయా?  శాంతి భ‌ద్ర‌త‌లు అంత‌గా దిగ‌జార‌న‌పుడు ఈ అంశం ప‌దేప‌దే తెర మీద‌కు తీసుకురావ‌డంలో ఆంత‌ర్య‌మేమిటి?  అంత విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉన్న‌ట్ల‌యితే సెక్ష‌న్‌-8 ఎందుకు అమ‌లు చేయ‌ట్లేదు? త‌దిత‌ర అంశాల‌పై ఒక‌సారి చ‌ర్చించుకోవాల్సిన సంద‌ర్భ‌మిది. అన్నింటికంటే ముందుగా అస‌లు సెక్ష‌న్‌-8 ఏం చెబుతున్న‌దో తెలుసుకోవ‌డం మ‌రీ ముఖ్యం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేయ‌డానికి సంబంధించి భార‌త పార్ల‌మెంట్ రూపొందించిన ‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014’-  12 భాగాలు, 13 షెడ్యూళ్లుగా పొందుప‌ర్చ‌బ‌డింది. ఒక్కో భాగం, ఒక్కో షెడ్యూల్ ఒక్కో అంశంపై స్ప‌ష్టంగా తెలియ‌జేసింది. అందులోని రెండో భాగం(పార్టు-2)లోని ప‌లు సెక్ష‌న్లు- రెండు రాష్ట్రాల భౌగోళిక స‌రిహ‌ద్దులు, ప‌రిధులు, రాజ‌ధాని, ప‌దేళ్ల పాటు హైద‌రాబాద్ న‌గ‌రం ఇరు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధాని కొన‌సాగ‌డం, త‌దిత‌ర అంశాల‌ను తెలియ‌జేస్తాయి. సుదీర్ఘ పోరాటం నేప‌థ్యంలో నెల‌కొన్న తీవ్ర ఉద్విగ్న‌భ‌రిత ప‌రిస్థ‌తులు, అనేక ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించ‌డ‌మే గాకుండా… భౌగోళికంగా, రాజ‌కీయంగా తెలంగాణ ప‌రిధిలో ఉన్నహైద‌రాబాద్ న‌గ‌రం ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా కొన‌సాగుతున్నందున‌, ఏదైన ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మైన‌ట్ల‌యితే ఎలా అన్న దానిపై పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోనే కొన్ని ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. దాన్ని తెలియ‌జేసేది సెక్ష‌న్‌-8.  ”ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో నివ‌శించే పౌరుల జీవ‌నం, స్వేచ్ఛ‌కు భంగం వాటిల్ల‌కుండా భ‌ద్ర‌త క‌ల్పించే ప్ర‌త్యేక బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌ది. ఉమ్మ‌డి రాజ‌ధానిలో శాంతి భ‌ద్ర‌త‌లు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌, కీల‌క సంస్థల భ‌ద్ర‌త‌, ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల కార్యాల‌యాలు, ఆస్తుల భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప‌రిస్థ‌తులు నెల‌కొన్న‌ట్ల‌యితే ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండ‌లిని సంప్ర‌దించిన త‌ర్వాత తాను ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్‌కు స‌హ‌క‌రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఇద్ద‌రు స‌ల‌హాదారుల‌ను నియ‌మిస్తుంది. ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌ల‌ను చ‌క్క‌బెట్టేందుకు త‌న విచ‌క్ష‌ణాధికారంతో గ‌వ‌ర్న‌ర్ తీసుకునేది తుది నిర్ణ‌యం. దాన్ని ప్ర‌శ్నించే అధికారం ఎవ‌రికీ లేదు” అని పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014లోని రెండో భాగంలోని సెక్ష‌న్‌-8 స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్న‌ది.

 

ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని ‘సెక్షన్‍-8’ ను ప్ర‌యోగించాల్సినంత స్థాయికి దిగ‌జారి పోయాయా? ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వాన్ని కాద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని హైద‌రాబాద్ న‌గ‌రంలోని శాంతిభ‌ద్ర‌త‌ల ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త గ‌వ‌ర్న‌ర్‌కు క‌ట్ట‌బెట్టాల్సినంత ప్ర‌తికూల ప‌రిస్థితులు నెల‌కొన్నాయా? వాస్త‌వ ప‌రిస్థితుల‌ను విశ్లేషించుకుంటే- తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన జూన్‌2, 2014 నుంచి నేటి వ‌ర‌కు అంటే గ‌డ‌చిన 22 నెల‌ల కాలంగా ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో ఏ ఒక్క చిన్న విధ్వేష‌పూరిత సంఘ‌ట‌న చోటు చేసుకోలేదు. న‌గ‌రంలో నివ‌శిస్తున్న ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య క‌నీసంగా ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం చోటుచేసుకున్న సంద‌ర్భ‌మూ లేదు. పైగా శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నాయ‌ని స్వ‌యంగా కేంద్ర ప్ర‌భుత్వ హోం శాఖ తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగాన్ని ప్ర‌శంసించింది కూడా. అలాంట‌పుడు ‘సెక్షన్‍-8’ ప్ర‌యోగించాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ తీర్మానం చేయ‌డంలో ఆంత‌ర్య‌మేమిటి? ఆరు ద‌శాబ్ధాలుగా హైద‌రాబాద్ కేంద్రంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌లోని స‌మ‌స్త వ‌న‌రుల‌పై నిరాటంకంగా సాగించిన దోపిడీ ఆగిపోవ‌డ‌మే ఈ అక్క‌సుకు కార‌ణం కాదా? ఇంకా ఏదో కార‌ణంగా హైద‌రాబాద్ పై పెత్త‌నం చ‌లాయించాల‌నే కుతంత్రంతోనే ఈ తీర్మానం. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఎలాంటి విఘాతం క‌లిగిన దాఖ‌లాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ‘సెక్షన్‍-8’ అమ‌లుకోసం ఏకంగా ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లోనే తీర్మానం చేయ‌డ‌మంటే భార‌త పార్ల‌మెంట్ చేసిన ‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014స ను అప‌హాస్యం చేయ‌డ‌మే.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన మొద‌ట్లో నెల‌కొన్న ఉధ్విగ్న‌భ‌రిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన వివిధ వ‌ర్గాల సీమాంధ్ర ప్ర‌జ‌ల్లో కొంత‌మేర‌కు భ‌యాన‌క‌, సందేహాస్ప‌ద ప‌రిస్థితులు నెల‌కొన్న మాట నిజం. కాని ‘రెండు రాష్ట్రాలుగా విడిపోదాం‍-ప్ర‌జ‌లుగా క‌లిసి ఉందాం’ అని ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మ‌కారులిచ్చిన నినాదాన్ని తెలంగాణ స‌మాజం దాదాపు రెండేండ్ల కాలంలో ఆచ‌ర‌ణ‌లో చూపింది. ముక్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేక‌ర్ రావు గారు అనుస‌రించిన వైఖ‌రి అందుకు ఎంత‌గానో దోహ‌ద‌పడింది. ఫ‌లితంగా ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రంలో స్థిర‌ప‌డిన‌, నివ‌శిస్తున్న సీమాంధ్ర‌, ఇత‌ర రాష్ట్రాలు, తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ధ్య సుహృద్భావ‌, సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిపిల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో న‌గ‌ర‌వాసులు ప్రాంతాల‌క‌తీతంగా తెలంగాణ ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం, న‌మ్మ‌కం ప్ర‌క‌టించారు. అధికార టీఆర్ఎస్ కు ఏక‌ప‌క్షంగా ప‌ట్టం క‌ట్ట‌డమే దాన్ని తేట‌తెల్లం చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ తీర్మానం చేయ‌డం కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రంలో సెక్షన్‍-8 అమ‌లుచేయాల‌ని విన‌తిప‌త్రం ఇవ్వ‌డాన్నితెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోనూ లేదు. వాస్తవంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నివ‌శించే సీమాంధ్ర ప్ర‌జలు, ఉద్యోగులతో పాటు సీమాంధ్ర‌కు చెందిన వ్య‌క్తుల వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక సంస్థ‌లు, ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలాంటి ‘సెక్షన్‍-8’ను సీమాంధ్ర రాజ‌కీయ నాయ‌కులు త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి రొటీన్ పొలిటిక‌ల్ డిమాండ్‌గా మారుస్తున్నారు. దీనివ‌ల్ల న‌ష్ట‌పోయేది సీమాంధ్ర ప్ర‌జ‌లు అన్న‌ది గుర్తెర‌గాలి. దీన్ని ప‌దేప‌దే వివాదాస్ప‌ద అంశంగా మార్చ‌డం వ‌ల్ల హైద‌రాబాద్‌లో నెల‌కొన్న సామ‌ర‌స్య‌, స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం తొల‌గిపోయి ఘ‌ర్ష‌ణ‌పూరిత ప‌రిస్థితులు చోటుచేసుకునే అవ‌కాశముంది. నిజంగా ఆ ప‌రిస్థితి త‌లెత్తితే అప్ప‌టికే చీటికిమాటికి తెర మీదికి వ‌చ్చిపోయి ఉంట‌ది కాబ‌ట్టి ఎవ‌రూ దాన్ని సీరియ‌స్‌గా తీసుకోకుండా న‌మ్మ‌నిస్థితి వ‌స్తుంద‌ని గ్ర‌హించాలి.
ఒక‌వైపున తెలంగాణ ముక్య‌మంత్రి కేసీఆర్ పంతాలు, ప‌ట్టింపుల‌కు పోకుండా తానే చొర‌వ తీసుకుని చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా పొరుగు రాష్ట్రాల‌తో స్నేహ‌పూర్వ‌క సంబంధాలు నెల‌కొల్పుకుంటూ, వివాదాలు ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో- ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముక్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అందుకు భిన్నంగా అన‌వ‌స‌ర ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం సృష్టించుకుంటున్నాడు. అది ఆయ‌న‌కు గానీ, ఆయ‌న ప్ర‌భుత్వానికి గానీ, హైద‌రాబాద్‌లోని సీమాంధ్ర ప్ర‌జ‌ల‌కు, వారి సంస్థ‌ల‌కు ఏ మాత్రం శ్రేయ‌స్క‌రం కాద‌ని గుర్తించాలి. మూస ఆలోచ‌నా దోర‌ణి మార్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే- ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని తెలంగాణ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ-వాటిపై ప్ర‌తిపాదిత ప్రాజెక్టులు పూర్తిచేసుకోవ‌డం… ప‌లు విద్యా సంబంధ వివాదాలు ప‌రిష్క‌రించుకోవ‌డం… ఇంకా ఉమ్మ‌డిగా ఉన్న ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల విభ‌జ‌న‌, వాటి ఆస్తుల పంప‌కాలు, త‌దిత‌ర అంశాల‌ను సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప‌రిష్క‌రించుకోవ‌డం ప్ర‌స్తుతానికే కాదు దీర్ఘ‌కాలిక‌ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఇరు రాష్ట్రాల‌కు అవ‌స‌రం. దాన్ని ప‌క్క‌న‌బెట్టి పొరుగు రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో చీటికిమాటికి జోక్యం చేసుకోవ‌డం ఆ రాష్ట్ర విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా అంత శ్రేయ‌స్క‌రం కాదు.

 

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌
email: palleravi@live.com

 

నిబద్ధ‌త‌కు నిలువుట‌ద్ధం… కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ

నూనూగు మీసాల న‌వ‌య‌వ్వ‌నంలో అందిపుచ్చుకున్న సామాజిక‌, రాజ‌కీయ‌, మాన‌వీయ విలువ‌ల‌ను జీవితాంతం కొన‌సాగించ‌డం అసాధార‌ణ‌మే! విద్యార్థి ద‌శ‌లోనో, యువ‌కుడిగా ఉన్న‌పుడో స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌, త్యాగం, నిబ‌ద్ధ‌త‌, త‌దిత‌ర సామాజిక విలువ‌ల‌తో నిఖార్సుగ నిల‌బ‌డిన‌వాళ్లు త‌ర్వాత జీవ‌న గ‌మ‌నంలో ఏదో సంద‌ర్భంలో స‌ర్దుబాటు త‌త్వాన్ని అల‌వ‌ర్చుకుని స‌గ‌టు మ‌న‌షులుగా మారుతుంటారు. మ‌రికొంద‌రైతే పూర్తి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. నాటి నిజాం వ్య‌తిరేక పోరాటంలో విద్యార్థిగా మొద‌లై నేటి తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం వ‌ర‌కూ- తాను న‌మ్మిన విలువ‌ల కోసం, ఆశించిన స‌మాజం కోసం దాదాపు ఎన‌భై ఏళ్లుగా నిల‌బ‌డిన నిఖార్సైన నాయ‌కుడు… నిబ‌ద్ధ‌త‌కు నిలువుట‌ద్ధం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ. భోగ‌బాగ్యాల‌నిచ్చే ప‌ద‌వుల కంటే న‌మ్మిన సిద్ధాంతమే ముఖ్య‌మ‌ని, దాన్ని జీవితాంతం ఆచ‌రించిన మ‌హ‌నీయుడు బాపూజీ. ఇలాంటి వారు ఏ రాజ‌కీయాల‌లో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల మ‌దిలో చిర‌స్మ‌ర‌ణీయులుగానే ఉంటారు. నిత్యం, కుట్ర‌లు, కుతంత్రాలు, కుళ్లు రాజ‌కీయాల‌తో పెన‌వేసుకున్న కాంగ్రెస్ పార్టీతోనే ఆయ‌న చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించారు రాజ‌కీయ ప్ర‌స్థానం. ఎన‌భైవ ద‌శ‌కం త‌ర్వాత క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ మాన‌సికంగా ఎన్న‌డూ కాంగ్రెస్ను వీడ‌లేదు.

నిజాం న‌వాబుల ఏలుబ‌డిలోని ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ తాలూకాలోని మారుమూల గ్రామం వాంకిడిలో 1915, సెప్టెంబ‌ర్‌27న జ‌న్మించిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ- నియంతృత్వ భూస్వామ్య‌, పెత్తందారీ నిజాం రాచ‌రిక పాల‌న‌కు వ్య‌తిరేకంగా యువ‌కుడిగా ఆరంభ‌మైన ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం… 2012 సెప్టెంబ‌ర్‌, 21న తుది శ్వాస వీడిచేంత వ‌ర‌కు ఆయ‌న ఏనాడు సామాజిక మూలాలు వీడ‌లేదు. దోపిడి, పీడ‌న‌, ఆధిప‌త్యం, వివ‌క్ష‌, అణ‌చివేత‌, సామాజిక అంత‌రాలకు వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డారు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా 1975లో కాంగ్రెస్ పార్టీని వీడారు.1952-78 వ‌ర‌కు శాస‌న‌స‌భ్యుడికి ఉన్న కాలంలోనూ ఏనాడూ ఆ విలువ‌ల గీటురాయి దాట‌లేదు. తెలుగు నేల‌పై ఏక‌కాలంలో నాలుగు భిన్న‌మైన అంత‌ర్గ‌త సంబంధం క‌లిగిన ప్ర‌జా ఉద్య‌మాలు- నిజాం వ్య‌తిరేక పోరాటం, వెన‌క‌బ‌డిన కులాల ఉద్య‌మం, చేనేత స‌హ‌కార ఉద్య‌మం, ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మాల‌తో ఆయ‌న జీవితం ముడివ‌డి ఉన్న‌ది.

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ రెండు ల‌క్ష్యాల కోసం త‌న జీవితాంతం కృషిచేశారు. అందులో ఒక‌టి- త‌ర‌త‌రాలుగా ప‌రాయిపాల‌న‌లో మ‌గ్గిన తెలంగాణ స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యాల కోస‌మైతే, రెండోది- స్వాతంత్య్ర ఫ‌లాలు, అభివృద్ధి ఫ‌లాలు స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు… ప్ర‌త్యేకించి అణ‌గారిన వ‌ర్గాల‌కు ద‌క్క‌డం. త‌ద్వారా అంత‌రాలు, అస‌మాన‌త‌లు లేని స‌మాజం(ఆయ‌న దృష్టిలో `సామాజిక న్యాయం`) ఆవిష్కృతం కావ‌డం. ఈ రెండు విష‌యాల్లో ఆయ‌న ఏనాడూ రాజీప‌డ‌లేదు. పైగా ఆ ల‌క్ష్యసాధ‌న‌లో ఎలాంటి త్యాగానికైనా వెనుక‌డుగు వేయ‌లేదు. 1969లో ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం కోసం- అప్ప‌టి ముఖ్య‌మంత్రి కాసు బ్ర‌హ్మానంద రెడ్డి మంత్రివ‌ర్గంలో ఉన్న ఆయ‌న త‌న ప‌ద‌విని తృణ‌పాయంగా వ‌దులుకున్న ఏకైక నాయ‌కుడు బాపూజీ. ఇవ్వాల్టి మంత్రుల మాదిరిగా రాజీనామా డ్రామాలు ఆడ‌లేదు. ఒక‌సారి రాజీనామా చేసిన త‌ర్వాత అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ఆనాటి నుంచి ఆఖ‌రి శ్వాస విడిచేంత వ‌ర‌కు ప‌ద‌వులు చేప‌ట్ట‌కుండా తెలంగాణ‌కోసం నిల‌బ‌డిన నిఖార్సైన మ‌నిషి. తెలంగాణ కోసం తానుగా నిరంత‌రం ప‌నిచేయ‌డ‌మే కాకుండా ఆ ప్ర‌య‌త్నానికి ఎవ‌రూ ముందుకొచ్చినా వెన‌కాముందూ ఆలోచించ‌కుండానే, చిన్న‌పెద్దా తేడా లేకుండా స‌హ‌క‌రించిన మ‌హ‌నీయుడు. అందుకే ఇవ్వాళ ఆయ‌న సైద్ధాంతిక వైరుద్ధ్యాల‌కు అతీతంగా తెలంగాణుద్య‌మానికి, తెలంగాణ ఉద్య‌మ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద‌దిక్కు అయ్యారు.తెలంగాణ అంటేనే విభిన్న‌భావ‌జాలాలు, అస్తిత్వాల నిల‌యం. అవ‌న్నీ- భిన్న‌త్వంలో ఏక‌త్వం మాదిరిగా `కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ` ద‌గ్గ‌ర తెలంగాణ అనే ఉమ్మ‌డి అస్తిత్వంతో క‌లుసుకునేవి. అందుకు ఆయ‌న‌, ఆయ‌న ఇల్లు కేంద్ర బిందువుగా మారింది.

తెలంగాణ ఏజెండా ఎత్తుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ బాపూజీ పెద్ద దిక్కుగానే నిలిచారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ ఎస్‌) అధినేత‌, నేటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖ‌ర్ రావు(కేసీఆర్‌), న‌వ తెలంగాణ పార్టీ స్థాపించిన‌పుడు టి.దేవేంద‌ర్ గౌడ్‌, ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్‌, విమ‌ల‌.. ఇలా ఎవ‌రు తెలంగాణ జెండా అందుకున్నా వారితో తొలి అడుగువేయించింది బాపూజీనే. ల‌క్ష్య‌సాధ‌న‌లో వారితో క‌లిసి న‌డుస్తూనే… వారు కార్యాచ‌ర‌ణ‌లో అప్ప‌ట‌డుగులు వేసిన‌ట్ల‌యితే అంగీక‌రించ‌లేని మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ది.దాన్ని నిర్మొహ‌మాటంగానే ప్ర‌శ్నించేవారు.ఆ కార‌ణంగానే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప‌లు సంద‌ర్భాల్లో విభేదించారు. అది కార్యాచ‌ర‌ణ‌లో భిన్నాభిప్రాయ‌మే త‌ప్ప ల‌క్ష్య‌సాధ‌న‌లోహిత్యంతో తోచిన‌ట్లుగా అనుకున్నారు. 2001 ఏప్రిల్‌27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావం కూడా బాపూజీ నివాస‌మైన నాటి `జ‌ల దృశ్యం`లోనే జ‌రిగింది. ఆ త‌ర్వాత పార్టీ కార్యాల‌యానికి త‌న ఇంటినే ఇచ్చారు. మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి బాపూజీ నివాస‌మైన జ‌ల‌దృశ్యం కేంద్రం కావ‌డంతో, అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం చిన్న సాంకేతిక కార‌ణం చూపి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీని జ‌ల‌దృశ్యం నుంచి దౌర్జ‌న్యంగా పోలీసు బ‌ల‌గాల‌తో ఖాళీ చేయించింది. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని సైతం దౌర్జ‌న్యంగా అక్క‌డి నుంచి తొల‌గించారు పోలీసులు. ఆ త‌ర్వాత అన్ని పార్టీల జోక్యంతో… 2004లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం, బాపూజీ తుదిశ్యాస విడిచేంత వ‌ర‌కు నివ‌సించిన గాంధీ న‌గ‌ర్‌లోని నాలుగు గదుల ఇంటిని కేటాయించిందే త‌ప్ప జీవిత‌కాలం నివ‌సించిన జ‌ల‌దృశ్యం తిరిగి అప్ప‌గించ‌లేదు. తొంభై ఏళ్ల వ‌య‌సులో అంత‌టి అవ‌మానాన్ని సైతం తెలంగాణ‌కోసం మౌనంగా భ‌రించారు. ఈ విష‌యంలో తెలంగాణ ఉద్య‌మ‌కారులు త‌గువిధంగా స్పందించ‌లేద‌ని ఒకింత భాద‌ప‌డ్డారే త‌ప్ప త‌న ల‌క్ష్య‌సాధ‌న మార్గం వీడ‌లేదు.

అప్ప‌టివ‌ర‌కు ఉద్య‌మానికి,,ఉద్య‌మ శ‌క్తుల‌కు స‌హ‌క‌రిస్తూ వ‌చ్చిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ- 2007 త‌ర్వాత తానే స్వ‌యంగా ప్ర‌త్య‌క్ష ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు.గాంధేయ‌మార్గంలో స‌త్యాగ్ర‌హం ఆయుధంగా ఎంచుకున్నారు. దానికి తొమ్మిది ప‌దుల వ‌య‌స్సును సైతం లెక్క‌చేయ‌లేదు. సైద్ధాంతిక వైరుద్ధ్యాల‌కు అతీతంగా ఉద్య‌మ శ‌క్తులు, సంస్థ‌లు, వ్య‌క్తులంద‌రినీ ఒక్క‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. అనేక రాజ‌కీయ కార‌ణాల రీత్యా ఆచ‌ర‌ణ‌లో అది సాధ్యం కాక‌పోయి ఉండొచ్చు, కానీ ఆ స‌మ‌యంలో ఆ ప్ర‌య‌త్నం అన్ని రాజ‌కీయ పార్టీల‌పై తెలంగాణ రాష్ట సాధ‌న‌కై నిర్ణ‌యం దిశ‌గా ఒత్తిడిని తీవ్రంగా పెంచ‌గ‌లిగింది. అలా ప‌రిణామ‌క్ర‌మంలో అంద‌రూ తాము తెలంగాణ‌కు అనుకూల‌మే అని చెప్ప‌క‌త‌ప్ప‌ని అనివార్య‌త‌ను క‌ల్పించ‌గ‌లిగారు.అదేక్ర‌మంలో 2009 డిసెంబ‌ర్‌9 ప్ర‌క‌ట‌న త‌ర్వాత ప‌రిణామాల్లో ఆయ‌న పోషించిన పాత్ర ఎన‌లేనిది. చ‌లికి న‌వ‌యువ‌కులు సైతం వ‌ణుకుతున్న స‌మ‌యంలో ఢిల్లీలో 97ఏళ్ల వృద్ధుడైన ఆయ‌న న‌వ‌యువ‌కుడిలా.. ప‌లువురు స్వాతంత్య స‌మ‌రయోధుల‌తో క‌లిసి వారం రోజులు స‌త్యాగ్ర‌హ‌దీక్ష‌కు కూర్చొని… కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానంలో మ‌రోసారి క‌ద‌లిక తెప్పించ‌గ‌లిగారు. ఆ స‌మ‌యంలో అవ‌గాహ‌నారాహిత్యంతో ప‌లువురు చేసిన విమ‌ర్శ‌ల‌ను సైతం ఆయ‌న లెక్క‌చేయ‌లేదు.ఆఖ‌రికి క‌ర‌డుగ‌ట్టిన తెలంగాణ వ్య‌తిరేకి, అప్ప‌టి విజ‌య‌వాడ లోక్‌స‌భ స‌భ్యుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌లాంటి వ్య‌క్తిని త‌న ఇంటికి పిలిచి తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను గౌర‌వించాల‌ని ఒప్పించి, మెప్పించే ప్ర‌య‌త్నం చేసిన సాహ‌సి. తెలంగాణ‌లో అప్పుడు నెల‌కొన్న ప‌రిస్థితుల్లో అది ఆయ‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. రాజ‌గోపాల్‌లాంటి మూర్ఖుడైన వ్య‌క్తి ఒప్పుకోడ‌న్న విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ, ఆ ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌కూడ‌ద‌న్న రాజ‌నీతిజ్ఞుడాయ‌న‌. తెలంగాణ కోసం ఏ ఒక్క ప్ర‌య‌త్న‌మూ వ‌దులుకోని త‌ప‌స్వి.

నాటి స్వాతంత్య్ర పోరాటంలో `క్విట్ ఇండియా` ఉద్యమంతో ఉద్య‌మ తొలి అడుగులు వేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ- 1952 నాన్ ముల్కీ ఉద్య‌మం, 1969 తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం మంత్రి ప‌ద‌వికి రాజీనామా, 1996లో మ‌ళ్లీ మొద‌లైన మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం.. ఇలా తెలంగాణ స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం, ఆర్థిక స్వావ‌లంభ‌న‌, స్వ‌యంపాల‌న కోసం సాగిన అన్ని త‌రాల పోరాటాల ప్ర‌త్య‌క్ష భాగ‌స్వామి, కార్య‌క‌ర్త‌, నాయ‌కుడు, అలుపెరుగ‌ని పోరాట యోధుడు. బాపూజీ జీవితం నేటి త‌రం తెలంగాణ నేత‌లు, ఉద్య‌మ‌కార్య‌క‌ర్త‌ల‌కు ఒక సందేశం. ఆజ‌న్మాంతం ఆయ‌న పాటించిన విలువ‌లు- ల‌క్ష్య‌శుద్ధి, త్యాగం, అంకితభావం, ప‌ట్టుద‌ల‌, నిబద్ధ‌త‌, నిజాయితీ ఎప్ప‌టికీ ఆచ‌ర‌ణీయం. గాంధేయ‌వాదం పేరుతో అధికారం వెల‌గ‌బెట్టేవారికి ఆయ‌న జీవితం చెంప చెల్లుమ‌నిపిస్తుంది. ఆయ‌న స్ఫూర్తితో రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో సాగి, తెలంగాణ ప్ర‌జ‌ల ఆరు ద‌శాబ్ధాల స్వ‌ప్నం సాకారం చేసుకున్న తెలంగాణ స‌మాజం.. తెలంగాణ పున‌ర్నిర్మాణంలోనూ ఆయ‌న అందించిన విలువ‌లు కొన‌సాగించాలి. అదే ఆయ‌న‌కు నేటి త‌రం తెలంగాణ స‌మ‌ర్పించే నిజ‌మైన నివాళి.

ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌(టీజేఎఫ్‌)

email: palleravi@live.com

(Note:27Th September, 2015 KONDA LAXMAN BAPUJI’S CENTENARY BIRTH DAY CELEBRATIONS)

1948, సెప్టెంబ‌ర్‌17… చ‌రిత్ర‌లో ఒక పుట * నిరంకుశ రాచ‌రిక‌పాల‌న‌పై సామాన్యుడి దండ‌యాత్ర‌

1948, సెప్టెంబ‌ర్‌17… చ‌రిత్ర‌లో ఒక పుట * నిరంకుశ రాచ‌రిక‌పాల‌న‌పై సామాన్యుడి దండ‌యాత్ర‌

అది మట్టి మనుషుల పోరాటం… అస‌హాయుల‌చే ఆయుధాలు ప‌ట్ట్టించిన మ‌హ‌త్త‌ర స‌మ‌రాంగ‌ణం… ప్ర‌పంచ చ‌రిత్ర‌లో సామాన్యుడు కేంధ్రంగా సాగిన విప్ల‌వ పోరాటం…భూమికోసం, భుక్తికోసం, స్వేచ్ఛ‌కోసం మ‌ట్టి మ‌నిషి మ‌ర‌ఫిరంగై పేలిన వీరోచిత పోరాట‌గాథ‌…ప్ర‌పంచ విప్ల‌వోద్య‌మాల చ‌రిత్ర‌లో చెద‌ర‌ని నెత్తుటి చ‌రిత్ర‌… పాల‌కులు ప్ర‌జాకంఠ‌కులైతే ఎంత‌టివారైనా ప‌త‌నం త‌ప్ప‌ద‌ని చాటిచెప్పిన అస‌మాన పోరు… మ‌నిషిని మ‌నిషిగా చూడ‌ని గ‌డీల కిరాత‌క దొర‌త‌నాన్ని స‌మాధి చేసిన సాయుధ స‌మ‌రం… నిరంకుశ‌ నిజాం రాజ్యాన్ని నేలమట్టం చేసిన ఒక మ‌హా యుద్దం. వెట్టిచాకిరి, క‌ట్టు బానిసత్వానికి బలైపోయిన వెట్టి జీవుల తిరుగుబాటు. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి… సామాన్య‌ జనం నడిపిన అసామాన్య విప్లవం. బాంచన్ దొర.. కాల్మొ.క్త అన్న గొంతుకలే, ఆయుధ‌మందుకొని భూస్వామ్య దొరతనం, పెత్తందారీ వ్య‌వ‌స్థ‌ పునాదులను పెకిలించిన పోరాటం తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటం.
1948, సెప్టెంబర్ 17…
ఇది క్యాలండ‌ర్‌లో ఒక తేదీ మాత్ర‌మే కాదు… ప్రపంచ చరిత్రలో చెరగని అధ్యాయం… సామాన్యులు చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన రోజు… ప్ర‌పంచ విప్ల‌వ పోరాటాల‌న్నింటికీ ఒక స్ఫూర్తి, ప్రేర‌ణ‌- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. వీర తెలంగాణ విప్లవ పోరాటం. సెప్టెంబర్ 17 ను గుర్తుచేసుకుంటే ఎన్నో పోరాటాలు కళ్లముందు కదులుతాయి. మరెన్నో దారుణాలు గుర్తుకొస్తాయి. వ‌రంగ‌ల్ జిల్లా బైరాన్‌ప‌ల్లి, న‌ల్ల‌గొండ జిల్లా గుండ్రాంప‌ల్లి నెత్తుటి పొత్తిళ్లు… ఎందరో యోథుల వీర‌గాథ‌లు గుర్తుకొస్తాయి. తెలంగాణ ఏ ప‌ల్లెను, ఏ గ‌డ‌ప‌ను తాకినా ఉసిల్ల పుట్ట‌లా క‌దిలే రోమాంచిత‌ జ్ఞాప‌కాలు… దశాబ్దాలుగా స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమాల పురిటిగ‌డ్డ తెలంగాణ- ధిక్కారం, సాహ‌సం, త్యాగం, పోరాట స్ఫూర్తి, చైత‌న్యం గుర్తుకొస్తుంది. అన్నింటికీ మించి- వ్య‌వ‌స్థ పునాదులు పెకులుతున్నాయంటే పాల‌కుడు(ఏ రూపంలో ఉన్న‌ప్ప‌టికీ) ఏ ప‌క్షం వ‌హిస్తాడో సామాన్యుడికి తెలిసొచ్చిన రోజు.

హైదరాబాద్ సంస్థానం… 1712-1948 నిజాం రాచ‌రికం.
1948 ముందు వరకూ హైద‌రాబాద్‌ సంస్ధానాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించేవారు. దీన్నే తెలంగాణ, హైదారాబాద్ రాష్ట్రం అని కూడా పిలిచేవాళ్ళు. 1712 నుంచి 1948 సెప్టెంబ‌ర్ 17వ తేదీ వ‌ర‌కు సుమారు రెండు వంద‌ల సంవ‌త్స‌రాల పాటు నిజాం న‌వాబుల ఏలుబ‌డిలో ఉంది. హైదరాబాద్ సంస్థానం పరిధిలో 16 పరగణాలుండేవి. భాషా ప్రాతిపదికన ఈ పదహారు జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజించి పాలించేది నైజాం సర్కార్. తెలుగు వాళ్లకు 8 జిల్లాలు… మరాఠీలకు 5 జిల్లాలు… కన్నడిగులకు 3 జిల్లాలుండేవి. తమ‌ పాలన కొనసాగిస్తూనే నిజాం ప్రభువు బ్రిటీష్ వారికి సామంతుడిగా వ్యవహరించేవారు. నిజాం రాచ‌రిక పాలనలో- గ్రామాలన్నీ భూస్వాములు, పెత్తందార్లు, పటేల్లు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌ల ఆధీనంలో ఉండేవి. తెలంగాణలోని 10 వేల గ్రామాల్లో సుమారు 3 వేల గ్రామాలు నిజాం జాగీరు గ్రామాలే. జాగిరంటే సొంత ఆస్థి అని. మిగతావి జమీన్ దార్, పటేల్, పట్వారీల ఆధీనంలో ఉండేవి. వీళ్లంతా నిజాం ప్రభువుకు గ్రామాల్లో తొత్తులుగా వ్యవహరించే వాళ్లు. ప్రజలకు నిజాం పై కన్నా ఈ దొర‌లు, భూస్వాములు, పెత్తందార్ల అరాచ‌కాలు, దౌర్జ‌న్యాల మీద‌నే ఎక్కువ వ్య‌తిరేక‌త‌, క‌సి ఉండేది. అధికారం, అహంకారం క‌లిస్తే అరాచ‌క‌మే. స‌రిగ్గా నిజాం రాచ‌రిక పాల‌న‌లో అదే జ‌రిగింది.
గోళ్లూడ‌గొట్టి… 90 రకాల ప‌న్నులు వ‌సూలు.
త‌మ విలాసాలు, భోగ‌బాగ్యాల కోసం ప్ర‌తిదానిపై ప‌న్ను విధించేవారు. పుట్టుకకు పన్ను, చావుకు పన్ను. ఏ వేడుకైనా… వేదనకైనా…పన్ను కట్టాల్సిందే. చెల్లించే ప‌రిస్థితులు, స్తోమ‌త‌ లేకున్నా ప్ర‌జ‌ల గోళ్లూడ‌గొట్టి ప‌న్నులు వ‌సూలు చేసేవారు. మనుషులన్న ఒక్క గుర్తింపు తప్ప… బతుకు దుర్భరంగా సాగే రోజులవి. శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ, వెట్టి చాకిరీ, అణ‌చివేత‌. అలాంటి పరిస్థితుల్లో… ఆలోచనలే ఆయుధాలయ్యాయి. పోతే ప్రాణాలు… వస్తే స్వాతంత్ర్యం అన్న ఒకే ఒక్క నినాదంతో రజాకార్లకు, జమీందార్లకు, ప‌టేల్‌-పట్వారీలకు ఎదురు తిరిగాయి తెలంగాణ గ్రామాలు.

దండుక‌ట్టి దండ‌యాత్ర చేసిన సామాన్యుడు…
సామాన్యుల బ‌తుకుల‌తో దొర‌లు, పెత్తందార్లు, భూస్వాములు, ప‌టేల్‌, ప‌ట్వారీలు, దేశ్‌ముఖ్‌లు నెత్తుటి ఆట ఆడారు. అరాచ‌కం రాజ్య‌మేలింది. దీనికి తోడుగా నాగువ‌డ్డీ వ్యాపారం, అది క‌ట్ట‌లేక‌పోతే త‌ర‌త‌రాలుగా వెట్టిచాకిరి, క‌ట్టుబానిస‌త్వం… వ్య‌తిరేకంగా తెలంగాణ‌లో ఎక్క‌డిక‌క్క‌డే పోరాటాలు మొద‌ల‌య్యాయి. 1946 నాటికి తెలంగాణ ఒక అగ్నిగుండంగా మారింది. నాటి న‌ల్ల‌గొండ జిల్లా జ‌న‌గామ తాలూకాలోని విసునూర్ జాగీర్దారు విసునూరు రామ‌చంద్రా రెడ్డి అరాచాకాల‌పై సామాన్యులు దండుక‌ట్టారు. రెచ్చిపోయిన ఆయ‌న గుండాలు 1946 జూలై4న విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో దొడ్డి కొముర‌య్య నెల‌కొరిగాడు. ఈ సంఘ‌ట‌న‌తో అప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డిక‌క్క‌డ పాయ‌లుపాయ‌లుగా సాగుతున్న పోరాటం సాయుధ పోరాట రూపం తీసుకున్న‌ది. ఖిలా వ‌రంగ‌ల్‌లో కొద‌మ సంహంలా ర‌జాకార్ల‌తో వీరోచిత పోరాటం చేసి నెల‌కొరిగిన బ‌త్తిని మొగిల‌య్య గౌడ్ సంఘ‌ట‌న‌తో తెలంగాణ సామాన్యుడి గుండె ప్ర‌తీకార జ్వాల‌తో ర‌గిలిపోయింది. `భూమికోసం.. భుక్తికోసం.. విముక్తికోసం…` అన్న నినాదంతో 1947సెప్టెంబ‌ర్‌11న రావి నారాయ‌ణ రెడ్డి, మ‌ద్ధం ఎల్లారెడ్డి, మ‌గ్దూం మెహియుద్దీన్ త‌దిత‌ర క‌మ్యూనిస్టు నాయ‌కులు రైతాంగ సాయుధ పోరాటానికి అధికారికంగా పిలుపునిచ్చారు. ఫ్యూడ‌లిజం, భూస్వాముల అరాచ‌కాలు, అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా గ్రామ‌గ్రామాన అగ్నిపూల‌ను పూయించారు క‌మ్యూనిస్టులు. కార్చిచ్చులా వ్యాపించిన పోరాటం తెలంగాణ ప్ర‌తి అంగుళాన్ని ఉద్య‌మ‌ప‌థంలో న‌డిపించింది. `దున్నేవాడికే భూమి` అన్న ర‌ణ‌న్నినాదంతో గ‌ర్జించిన తెలంగాణ ప్ర‌పంచ విప్ల‌వాల‌కు కొత్త పాఠాలు నేర్పింది.

ఎంద‌రో యోధులు…

నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం కోసం సామన్య జనం తిరగబడి… ` మ‌న కోసం-మ‌న భావిత‌రాల కోసం` అంటూ తెలంగాణ స‌మాజాన్నిముందుకు న‌డిపించారు. మహిళలు సైతం బంధూకులు పట్టి పోరాడిన మహాత్తర ఘట్టం అది. ఈ పోరాటానికి క‌మ్యూనిస్టుల నేతృత్వంలోని ఆంధ్రమహాసభ నాయ‌క‌త్వం వ‌హించింది. బ‌త్తిని మొగిల‌య్య గౌడ్‌, షేక్ బంద‌గీ, దొడ్డి కొముర‌య్య‌, తానూ నాయ‌క్‌, రావి నారాయ‌ణ రెడ్డి, బ‌ద్ధం ఎల్లా రెడ్డి, భీంరెడ్డి న‌ర్సింహ రెడ్డి, ఆరుట్ల రాంచంద్రా రెడ్డి, ఆరుట్ల క‌మ‌లాదేవి, బొమ్మ‌గాని ధ‌ర్మ‌భిక్షం, న‌ల్ల న‌ర్సింహులు, మ‌ల్లు స్వ‌రాజ్యం….ఇలాంటి ఎంద‌రో నేతాజీలు, భ‌గ‌త్ సింగ్‌లు, అల్లూరి సీతారామ రాజులు, చెగువేరాలు ఈ మ‌హ‌త్త‌ర పోరాటంలో ప్ర‌జ‌ల‌ను న‌డిపించారు, 1946 నుంచి 1951 వరకు మహోద్యమంగా జరిగిన ఈ పోరాటంలో నాలుగువేల మందికి పైగా యోధులు నెల‌కొరిగారు…ఉద్య‌మ‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ జిల్లా బైరాన్ ప‌ల్లి, ప‌ర‌కాల‌, న‌ల్ల‌గొండ జిల్లా గుండ్రాంప‌ల్లి లాంటి ఎన్నో చోట్ల జ‌రిగిన ఊచ‌కోత ఆనాటి అరాచ‌కాల‌కు సాక్షిబూతాలుగా నిలిచాయి. మూడు వేల గ్రామాల్లో ప్ర‌జా ప్ర‌భుత్వాలు ఏర్ప‌డ్డాయి. ఆ గ్రామ క‌మిటీల సార‌థ్యంలో భూమిలేని నిరుపేద‌ల‌కు ప‌ది ల‌క్ష‌ల భూమి పంపిణీ జ‌రిగింది. నిజానికి 1947 ఆగస్టు 15న దేశానికి విముక్తి లభించింది. కాని తెలంగాణలో నిజాం ర‌క్క‌సి మూక‌లు, పెత్తందార్ల‌, భూస్వాములు, దొర‌ల అరాచ‌కాలు, దాష్టీకం కొన‌సాగుతూనే ఉన్న‌ది. దానికి వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టులు 1947సెప్టెంబ‌ర్ 11న సాయుధ‌పోరాటానికి పిలుపునివ్వ‌డంతో తెలంగాణవ్యాప్తంగా గెరిల్లా ద‌ళాల స‌హ‌కారంతో గ్రామ క‌మిటీలు దొర‌లు, పెత్తందార్లు, జాగీర్థార్ల‌ను గ్రామాల నుంచి త‌రిమికొట్ట‌డంతో ప‌ట్ట‌ణాల‌కు పారిపోయి.. నిజాం న‌వాబును ఆశ్ర‌యించారు. రెండు శ‌తాబ్దాల త‌మ పాల‌న‌కు అంతిమ గ‌డియ‌లు స‌మీపించాయ‌న్న‌ది గ్ర‌హించిన ఏడో నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. ఉత్తుంగ‌త‌రంగంలా లేచిన రైతాంగ సాయుధ పోరాటం నుంచి త‌న‌ను, త‌న తాబేధార్ల‌యిన దొర‌లు, భూస్వాములు, జాగీర్థార్ల‌ను ర‌క్షించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముందు మోక‌రిల్లాడు. భార‌త్‌కు స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ సంస్థ నిరంకుశ నిజాం పాల‌న ప్ర‌జ‌ల‌తో నెత్తుటి ఆట ఆడుతుంటే పెద్ద‌గా ప‌ట్టించుకోని యూనియ‌న్ ప్ర‌భుత్వ పెద్ద‌లు… రెండున్న‌ర శ‌తాబ్దాల నిజాం రాచ‌రికానికి, ఆయ‌న తాబేధార్ల అకృత్యాల‌కు మ‌హ‌త్త‌ర రైతాంగ సాయుధ పోరులో ప్ర‌జ‌లు స‌మాధి క‌ట్టే అంతిమ గ‌డియ‌ల్లో- నాటి ఉపప్రధాని, కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జ‌న‌ర‌ల్ చౌద‌రి ఆధ్వ‌ర్యంలో 1948 సెప్టెంబ‌ర్ 12న `ఆప‌రేష‌న్ పోలో` పేరిట సైనిక చ‌ర్య ప్రారంభించారు… అంటే 1948 సెప్టెంబర్ 17(అంటే భార‌త్‌కు స్వాతంత్యం సిద్ధించిన 13నెల‌ల రెండురోజుల‌కు) నిజాం న‌వాబు వ‌ల్ల‌బాయ్ ప‌టేల్ ముందు లొంగిపోయారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైంది హైదరాబాద్ స్టేట్. కేంద్ర ప్ర‌భుత్వ సైనిక చ‌ర్య‌తో తిర‌గ‌బ‌డి ప్ర‌జ‌ల నుంచి నిజాం న‌వాబుకు, పెత్తందార్ల‌కు విమోచ‌న ల‌భించ‌డ‌మే కాదు, భార‌త ప్ర‌భుత్వం నిజాం న‌వాబును రాజప్ర‌ముఖ్‌(1948 నుంచి 1956వ‌ర‌కు)గా నియ‌మించింది. 1956 న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డి, గ‌వ‌ర్న‌ర్ నియ‌మితులయ్యే వ‌ర‌కు ఆయ‌న రాజ‌ప్ర‌ముఖ్‌గా కొన‌సాగాడు ఏడో నిజాం- మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌. కానీ ఉద్య‌మించిన ప్ర‌జ‌ల ఊచ‌కోత కొన‌సాగింది. దాంతో రైతాంగ ఉద్య‌మ ఉధృతిలో గ‌ఢీలు వ‌దిలి ప‌ట్నాల‌కు పారిపోయిన దొర‌లు, భూస్వాములు, జాగీర్థార్లు పోలీసుల అండ‌తో మ‌ళ్లీ గ‌ఢీల‌కొచ్చారు.

చ‌రిత్ర‌లో ద‌క్క‌ని స‌ముచిత‌ స్థానం…
ప్ర‌పంచంలోని ఎన్నో విముక్తి పోరాటాలు, విప్ల‌వాలు, ఉద్య‌మాల‌కు స్ఫూర్తిగా. ప్రేర‌ణ‌గా నిలిచిన ఇంత‌టి మ‌హ‌త్త‌ర పోరాటానికి దేశ చరిత్రలో ద‌క్కాల్సిన గౌర‌వం, స్థానం ద‌క్క‌లేదు. ప్ర‌పంచ ఉద్య‌మాల గ‌తిని మార్చిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆన‌వాళ్లుగానీ, ఒక స్మృతి చిహ్నం కూడా ఎక్క‌డా లేక‌పోవ‌డమే పాల‌కులు ఏపాటి బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారో వెల్ల‌డిస్తున్న‌ది. ఎంద‌రో వీరుల త్యాగ‌ఫ‌లంగా స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ‌కు… ప్ర‌జ‌లు గ్రామాల నుంచి త‌రిమితే ప‌ట్నాలు, న‌గ‌రాలకు పారిపోయిన దొర‌లు, భూస్వామ‌లు, పెత్తందార్లే రంగు, రూపు, టోపీ మార్చి పాల‌కులుగా రావ‌డ‌మే ఈ దుస్థితికి కార‌ణం. అందుకే ఆరున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత కూడా సెప్టెంబ‌ర్ 17, 1948… విభిన్న‌వాద‌న‌లు ఉన్నాయి. కొందరు దీన్నివిలీన దిన‌మ‌ని… మరికొందరు విమోచ‌న దిన‌మ‌ని… ఇంకొందరు విద్రోహ దిన‌మ‌ని… ఎవరి వాదన ఏదైనా… ఈ రోజుకు వెన‌కా, ముందున్న అస‌మాన చ‌రిత్ర‌ను ఎవరూ కాదన లేనిది. తెలంగాణ నేల‌ దాస్య శృంఖలాల విముక్తి కోసం సాగిన మహాయుద్ధంలో నేల‌కొరిగిన వేలాది మంది అమ‌రవీరులను స్మ‌రించుకోవాల్సిన రోజు… త‌ర‌త‌రాలుగా సాగిన నిజాం రాక్ష‌స పాల‌న‌ను అంత‌మొందించిన రోజు… మాన‌వ‌జాతి వికాసం కోసం జ‌రిగే ప్ర‌జాపోరాటాల చ‌రిత్ర‌ను రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా భావిత‌రాల‌కు అందించాల‌ని ప్ర‌జాస్వామ్య పాల‌కుల‌కే కాదు చ‌రిత్ర‌కారుల బాధ్య‌త‌నూ గుర్తు చేసే రోజు… తెలంగాణ చ‌రిత్ర‌లోనే కాదు ప్ర‌పంచ‌ చరిత్రలోనే ఈ రోజు ఓ ప్రత్యేక పుట‌.
ఎందరెందరో త్యాగధనులకు… అలాంటి మ‌హ‌నీయుల పురిటిగడ్డకు… వంద‌నం.

***

ప‌ల్లె ర‌వి కుమార్‌

ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌(టీజేఎఫ్‌)

email: palleravi@live.com

`డిండి`, `పాల‌మూరు` ఎత్తిపోత‌లు ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నం – ప‌ల్లె ర‌వి కుమార్‌, ఉపాధ్య‌క్షుడు-తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌

        తెలంగాణ ఉద్య‌మ‌ ఆకాంక్ష‌, డిమాండ్లు నెర‌వేర్చ‌డంలో భాగంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారు రాష్ట్ర అవ‌త‌ర‌ణ తొలి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని నాలుగు బృహ‌త్త‌ర ప్రాజెక్టులు-  తెలంగాణ వాట‌ర్ గ్రిడ్, దామ‌ర చెర్ల‌లో యాదాద్రి మెగా ప‌వ‌ర్ ప్రాజెక్టు,   డిండి ఎత్తిపోత‌లు,  పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల  సాగునీటి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేశారు. అందులో మొద‌టి రెండింటికి పొరుగు రాష్ట్రాల‌తో ఎలాంటి పేచీ లేదు, కానీ మిగిలిన రెండు- 30టీఎంసీల నీటి నిల్వ సామ‌ర్ద్యంతో నిర్మించ  త‌ల‌పెట్టిన డిండి ఎత్తిపోత‌లు, 90టీఎంసీల నీటి నిల్వ సామ‌ర్ధ్యంతో ప్ర‌తిపాదించిన పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటివ‌న‌రు అందిచ్చే కృష్ణాన‌ది జ‌లాల పంప‌కం వ్య‌వ‌హారం మూడు రాష్ట్రాల‌తో ముడివ‌డి ఉన్న‌ది. తెలంగాణ‌కు ఎగువ‌న ఉన్న క‌ర్ణాట‌క‌తో కొత్త‌గా వచ్చిన స‌మ‌స్యేమి లేదు. దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో కృష్ణాజ‌లాల  పంప‌కానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి స్ఫ‌ష్ట‌త లేక‌పోగా, నాగార్జునసాగ‌ర్, శ్రీ‌శైలం ప్రాజెక్టులు ఇరు రాష్ట్రాల  ఉమ్మ‌డి ప్రాజెక్టులుగా ఉన్నాయి.  దీన్ని ఆస‌రాగా తీసుకుని డిండి, పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టుల‌ను అనుమ‌తులు లేనివిగానూ, నీటి కేటాయింపుల్లేనివిగానూ,  అ్ర‌క‌మ ప్రాజెక్టులుగానూ వివాదాస్ప‌దం చేయాల‌ని దిగువ రాష్ట్రం ఆంధ్ర్ర‌ప్ర‌ధేశ్ పెద్ద‌లు వ్యూహం ప‌న్నుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదంగా మార్చి, లేని వివాదాన్నిసృష్టించి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునే ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్లు అనిపిస్తున్న‌ది. కృష్ణాన‌ది అత్య‌ధిక దూరం ప్ర‌వ‌హించే తెలంగాణ‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ‌ జ‌ల‌పంపిణీ విధానాల‌కు అనుగుణంగా  హ‌క్కుల‌కు లోబ‌డి ఎపుడో రూప‌క‌ల్ప‌న చేసిన‌ప్ప‌టికీ-  స‌మైక్యాంధ్ర పాల‌న‌లో తెలంగాణ ప‌ట్ల చూపిన  నిర్ల‌క్ష్యం, వివ‌క్ష‌, బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల అమ‌లుకు నోచుకోని పెండింగ్ ప్రాజెక్టుల‌న్న అస‌లు మోసాన్ని దాచిపెట్టి – ఇవేవో అ్ర‌క‌మంగానూ, దౌర్జ‌న్యంగానూ నీటిని మ‌లుపుకు పోయేందుకు కొత్త‌గా ప్రాజెక్టుల‌కు రూప‌క‌ల్ప‌న చేసినట్లుగా స్థానికంగానూ, కేంద్ర ప్ర‌భుత్వాన్ని గంద‌ర‌గోళ ప‌రిచే కుట్ర‌లు మొద‌లైన‌ట్లు క‌నిపిస్త‌న్న‌ది. ఇంత‌కాలంగా తీవ్ర అన్యాయానికి గురైన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాల విస్తృత ప్ర‌యోజ‌నాల దృష్ట్యా స్వ‌ల్ప మార్పుల‌తో సుధీర్గ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న‌ప్రాజెక్టులే త‌ప్ప ఆ రెండింటిలో ఏదీ కొత్త‌ది కాద‌న్న‌ది అక్ష‌రాల నిజం. కృష్ణాజ‌లాల్లో తెలంగాణ‌కు కేటాయించిన 300 టీఎంసీలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఉద్ధేశించిన ప్రాజెక్టులు మాత్ర‌మే.

     ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌ధేశ్‌లో  ఇష్టారాజ్యంగా పోతిరెడ్డిపాడు, గాలేరు -న‌గ‌రి, హంద్రీ -నీవా, వెలుగోడు ఎలాంటి అనుమ‌తుల్లేకుండా అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ‌ను బీడుభూములుగా మార్చినవారు, సొంత రాష్టంలోనైనా సొంత‌హ‌క్కుల‌ను ఉప‌యోగించుకుని ప్రాజెక్టులు నిర్మంచుకుందామంటే వివాదం సృష్టించుకోవాల‌నుకోవ‌డం వారి నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టింది. అందులోనూ ద‌శాబ్దాలుగా ఫ్లోరైడ్ ర‌క్క‌సితో ల‌క్ష‌లాది మంది గోస తీస్తున్న న‌ల్ల‌గొండ‌, క‌రువు కాట‌లకాల‌తో బ‌తుకుదెరువు కోసం నిత్యం ల‌క్ష‌లాది మంది వ‌ల‌స‌లు వెళ్లే పాల‌మూరు జిల్లాలో సుమారు ప‌ద‌మూడున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుల విష‌యంలో లేని వివాదాన్ని సృష్టించి ప్ర‌తిపాదిత ప్రాజెక్టులు ముందుకు సాగకుండా అడ్డుకోవాల‌నుకోవడం బాధ్య‌తారాహిత్యం, దుర్మార్గం. అన్నింటికి మించి అమాన‌వీయం. అలాంటి అసంబద్ధ వాద‌న‌లు చేసే సీమాంధ్ర పెద్ద‌లు ఈ ప్రాజెక్టుల సాధ‌న‌కోసం నాలుగు ద‌శాబ్దాలుగా ప్ర‌జ‌లు సుదీర్ఘ‌పోరాటం చేస్తున్నార‌న్న చారిత్ర‌క స‌త్యాన్ని విస్మ‌రించ‌కూడ‌దు. కొత్త ప్రాజెక్టులే అయితే ఈ ప్రాంతాల సాగునీటికి ఉద్దేశించి శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు కాల్వ‌(ఎస్ ఎల్ బీసీ)కు సుమారు మూడున్న‌ర ద‌శాబ్దాల కింద‌టే పునాదిరాయి వేశార‌న్న‌ది మ‌ర‌చిపోయారా? ఎస్ఎల్‌బిసికి 1978 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆరుసార్లు ముఖ్య‌మంత్రులు శంకుస్థాప‌న‌లు ఎందుకు చేశారో స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

సుదీర్ఘంగా సాగిన జ‌ల‌సాధ‌న ఉద్య‌మం…

     జీవ‌న‌ది అయిన కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో ఉండి తీవ్ర‌, శాశ్వ‌త దుర్భిత ప్రాంతాలుగా మారిన న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లోని దేవ‌ర‌కొండ‌, మునుగోడు, అచ్చంపేట, క‌ల్వ‌కుర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్ త‌దిత‌ర నియోజ‌క‌వర్గాల‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగునీటి కోసం ప్ర‌జ‌ల‌ది సుదీర్ఘ పోరాటం. కృష్ణా న‌ది ప‌రివాహ‌క ప్రాంత హ‌క్కుదారులుగా కృష్ణా జ‌లాల సాధ‌న‌కోసం అక్క‌డి ప్ర‌జ‌లు చేయ‌నిపోరాటం లేదు. ఎన్నిక‌లొచ్చిన‌పుడల్లా ఆ రెండు జిల్లాల ప్ర‌జ‌లను మ‌భ్య‌పెట్టేందుకు స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కులు ప‌దేప‌దే శంకు్‌స్థాప‌న‌లు చేయ‌డం మిన‌హా నాలుగు ద‌శాబ్దాలుగా ఒర‌గ‌బెట్టిందేమీ లేదు. పైగా సొరంగం(ట‌న్నెల్‌) మార్గం ద్వారానా? లేదా ఎత్తిపోతలు(లిఫ్ట్‌) ద్వారా నీళ్లు ఇవ్వాలా? అన్న విష‌యం నిర్ణయించ‌డానికే మూడు ద‌శాబ్దాలు ప‌ట్టింది. న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల సాగు, తాగునీటికి ఉద్దేశించిన ఎడమ‌గ‌ట్టు కాల్వ తొలిసారిగా 1978లో శంకుస్థాప‌న రాయి ప‌డింది. ఆనాటి నుంచి నేటివ‌ర‌కు ప్ర‌తి ఎన్నిక‌ల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఎస్ ఎల్ బీసి పూర్తి చేయాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్‌-హామీగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీరామారావు అధికార‌ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే మ‌రోసారి 1985లో శంకుస్థాప‌న చేశారు. అయిన‌ప్ప‌టికీ నిర్మాణ‌ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో క్షేత్ర‌స్థాయిలో జ‌ల‌సాధ‌న ఉద్య‌మం మొద‌లైంది. ప్ర‌పంంచంలోనే అదిపెద్ద మాన‌వ నిర్మిత‌, కాంక్రీట్ సాగునీటి ప్రాజెక్టు నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు ప‌క్క‌నే ఉన్న‌ప్ప‌టికీ ఆ ప్రాంత ప్రజలు తాగు, సాగునీటికోసం అల్లాడుతున్న తీరు చూసి క‌ల‌త‌చెందిన బ్యాంకు అధికారి దుచ్ఛ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ త‌న ఉద్యోగాన్ని వ‌దులుకుని గ్రామ‌స్థాయిలో జ‌ల‌సాధ‌న ఉద్య‌మానికి అంకురార్ప‌ణ చేసిప్ప‌టికీ స‌మైక్యాంధ్ర పాల‌కులు క‌న‌క‌రించ‌లేదు. శంకుస్థాప‌న చేయ‌డం త‌ప్ప ఆ కాల్వ‌ల‌కు త‌ట్టెడు మ‌ట్టిని కూడ త‌వ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే 1994లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ముక్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి మ‌రోసారి శంకుస్థాప‌న చేసేందుకు న‌ల్ల‌గొండ జిల్లాలోని పిఏ ప‌ల్లి మండ‌లం కోదండ‌పురానికి ఎంతో ఆర్భాటంగా రావ‌డంతో.. ర‌గిలిపోయిన ప్ర‌జ‌లు పెద్ద‌యెత్తున చుట్టుముట్టి శాంతియుతంగా అడ్డుకున్నారు. అయినా భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌తో ధౌ్‌ర్జ‌న్యంగా శంకుస్థాప‌న‌కు పూనుకోవ‌డంతో ప్ర‌జ‌లు అనూహ్య‌రీతిలో తిర‌గ‌బ‌డి తీవ్ర‌స్థాయిలో ప్ర‌తిఘ‌టించారు. పోలీసుల లాఠీచార్జీ, ఫైరింగ్‌, ప్ర‌జ‌ల తిరుగుబాటులో ఒక ఎస్సై, కానిస్టేబుల్‌, ఇద్ద‌రు రైతులు అక్క‌డిక్క‌క‌డే మృతిచెందారు. అయినా జ‌ల‌సాధ‌న ఉద్య‌మం ఆగ‌లేదు. ఆ క్ర‌మంలోనే రెండోసారి అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టిన ఎన్టీఆర్ ను 1995 లో య‌శంకుస్థాప‌న చేయ‌కుండా ప్ర‌జ‌లు అడ్డుకున్నారు.

             అదేక్ర‌మంలో 1996లో వచ్చిన లోక్‌స‌భ మ‌ధ్యంతర ఎన్నిక‌ల‌ను బ్ర‌హ్మ‌స్ర్తంగా వాడుకున్నారు ఉద్య‌మ‌కారులు. 480 మంది ఫ్లోరైడు బాధితులు, జ‌ల‌సాధ‌న ఉద్య‌మ‌కారులు న‌ల్ల‌గొండ లోక్‌స‌భ స్థానానికి నామినేష‌న్లు వేయ‌డంతో యావ‌త్ భార‌త‌దేశం బిత్త‌ర‌పోయింది. అంత మంది అభ్య‌ర్థుల‌తో బ్యాలెట్ త‌యారుచేయ‌లేమ‌ని భార‌త ఎన్నిక‌ల సంఘం చేతులెత్తేసింది. గ‌త్యంత‌రం లేక ఎన్నిక‌లు వాయిదావేసి మూడునెల‌ల త‌ర్వాత ప్ర‌త్యేకంగా బ్యాలెట్ రూపొందించి ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేసింది. దీంతో ఖంగుతిన్న యావ‌త్ రాజ‌కీయ ప‌క్షాలు త‌మ బాధ్య‌త‌ను గుర్తెరిగి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డ‌కుండా… అప్ప‌టివ‌ర‌కు సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు చెల్లించాల్సిన నామినేష‌న్ ఫీజును రూ.1000లు, రూ.500ల‌ను రూ.ప‌దివేలు, రూ. 5వేల‌కు పెంచుతూ పార్ల‌మెంట్‌లో ప్ర‌త్యేక చ‌ట్టం చేశారు త‌ప్ప ప్ర‌జ‌లు ఎత్తిచూపిన స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విజ్ఞ‌త‌, బాధ్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌లేదు పాల‌కులు.

చివ‌ర‌గా న్యాయ‌పోరాటం….

          ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా, శాంతియుతంగా ద‌శాబ్దాలుగా సాగిన జ‌ల‌సాధ‌న ఉద్య‌మం చివ‌ర‌గా న్యాయ‌పోరాటం చేసింది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటికోసం త‌క్ష‌ణ‌మే కృష్ణా జ‌లాలు అందివ్వాల‌ని హైకోర్టు 2001లో రాష్ర్ట ప్ర‌భుత్వాన్ని అదేశించిన‌ప్ప‌టికీ స‌మైక్యాంధ్ర పాల‌కుల‌కు ప‌ట్ట‌లేదు. గ‌త్యంత‌రంలేక కోర్టు ధిక్కారం కింద మ‌ళ్లీ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా 2004లో- `ఇది ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వ బాధ్య‌తారాహిత్యం. ఫ్లోరైడ్ విషం తాగే ప్ర‌జ‌ల‌కు ర‌క్షిత మంచినీరు ఇవ్వ‌లేని ప్ర‌భుత్వానికి మ‌నుగ‌డ సాగించే నైతిక‌త లేదు. సంవ‌త్స‌రంలోగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఇవ్వ‌క‌పోయిన‌ట్ల‌యితే న్యాయ‌స్థానం జోక్యం చేసుకోవాల్సి వ‌స్తుంది` అని హైకోర్టు తీవ్ర‌స్థాయిలో రాష్ర్ట ప్ర‌భుత్వానికి చీవాట్లు పెట్టింది. అపుడ‌పుడే అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టిన అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి దేవ‌ర‌కొండ‌, మునుగోడు, న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గాల్లోని 120 ఫ్లోరైడ్ పీడిత గ్రామాల‌కు పైప్‌లైన్ల ద్వారా అర‌కొర‌గా కృష్ణా జ‌లాలు తాగునీటిగా ఇవ్వ‌డ‌మైంది. కోర్టు జోక్యం చేసుకుంటే త‌ప్ప తాగునీరు ఇవ్వ‌ని పాల‌కుల‌పై సాగునీటి పోరాటం ఆగ‌లేదు. తెలంగాణ రాష్ర్ట‌సాధ‌న ఉద్య‌మంలో అంత‌ర్భాగంగా జ‌ల‌సాధ‌న పోరు అవిశ్రాంతంగా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఉద్య‌మ‌తీవ్ర‌త నేప‌థ్యంలోనే డిండి ఎత్తిపోత‌ల ప్రాజెక్టు స‌ర్వే కోసం 2007 జూలై 7వ తేదీన జీవో 169 ఇచ్చి, 2008 సెప్టెంబ‌ర్ 23న పూర్తిస్థాయి నివేదిక‌(డిపిఆర్‌) ఇవ్వ‌డ‌మే కాదు- `మాన‌వీయ‌కోణంలో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న డిండి ప్రాజెక్టు చేప‌డుతామ‌ని అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేక‌ర రెడ్డి దేవర‌కొండ‌లో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌క‌టించిన విష‌యం మ‌ర‌చిపోవ‌ద్దు. అదేవిధంగా 70టీఎంసీల నీటినిల్వ సామ‌ర్థ్యంతో పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు 2013 ఆగ‌స్టు 8వ తేదీన అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి జీవో 72 ఇచ్చారు.

          క‌రువు పీడిత‌, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల‌కు సాగు, తాగునీరుగా కృష్ణా జ‌లాలు అందించేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోత‌లు, పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు సాగునీటి ప్రాజెక్టులు న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్పం. అందుకోసం నాలుగు ద‌శాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్ర‌తి వేదిక‌ను, ప్ర‌తి సంద‌ర్భాన్ని ఉప‌యోగించుకుని త‌మ నిర‌స‌న‌ను ప్ర‌జాస్వామ్య పాల‌కుల ముందుంచారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన హ‌క్కుగానే కాకుండా మాన‌వ‌తా థృక్ప‌థంతోనైనా త‌మ గోస తీర్చ‌మ‌ని వేడుకున్నారు ప్ర‌జ‌లు. పాల‌కులు చ‌లించ‌లేదు. బాధ్య‌త గుర్తెరుగ‌లేదు. ల‌క్ష‌లాది మంది ఫ్లోరైడు బాధితుల గోడు తీర‌లేదు. నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1.5పిపిఎం దాటితేనే ఆ నీటిని  తాగ‌కూడ‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్‌వో)లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ ఫ్లోరైడ్ మోతాడు 10పిపిఎం(దాదాపు విషంతో స‌మానం) కంటే మించి ఉన్న గ్రామాలు ఎన్నో(న‌ల్ల‌గొండ జిల్లా మ‌ర్రిగూడ మండ‌లం భ‌ట్ల‌ప‌ల్లి త‌దిత‌ర చోట్ల 14పిపిఎం ఉందంటే ఆ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు)… మాన‌వత‌ప్పిదం వ‌ల్ల‌, పాల‌కుల బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల ఇప్ప‌టికీ రెండు ల‌క్ష‌లమంది ఫ్లోరోసిస్ వ్యాధిగ్ర‌స్తులుగా 30ఏండ్ల వ‌య‌స్సులోనే శాశ్వ‌త విక‌లాంగులుగా మంచం ప‌ట్టారు. క‌నీసం భ‌విష్య‌త్ త‌రాలైన ఫ్లోరోసిస్ బారిన ప‌డ‌కుండా నివారించాలంటే ఆ ప్రాంతాల్లో సాగునీరుగా, తాగునీరుగా భూగ‌ర్భ‌జ‌లాలు వినియోగించ‌కుండా న‌దీ జ‌లాల‌ను అందివ్వ‌డ‌మొక్క‌టే మార్గ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు, వైద్య నిపుణులు ప‌లు నివేదిక‌లు ఇచ్చారు. దాన్నిరాజ‌కీయ‌ప‌క్షాలు గుర్తెరిగి విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించి ఆ బాధ్య‌త‌ను స్వీక‌రించాలి. ఆ కార‌ణంగానే తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో ఫ్లోరోసిస్‌, క‌రువు, వ‌ల‌స‌లు ప్ర‌ధాన ఎజెండాగా మారాయి.

             ప‌ద‌మూడేళ్ల ఉద్య‌మ ప్ర‌స్థానంలో బాధిత ప్ర‌జ‌లు, ప‌లు సామాజిక ఉద్య‌మ కార్య‌కర్త‌ల‌తో మ‌మేక‌మై ప‌నిచేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముక్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేక‌ర‌రావు గారు బాధిత ప్ర‌జ‌ల ఆర్తి, ఆర్థ్ర‌త‌ను త‌న బాధ్య‌త‌గా స్వీక‌రించారు. ఆ బాధ్య‌త‌ను స‌త్వ‌ర‌మే నెర‌వేర్చేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న డిండి, పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టుల‌కు అత్యంత ప్రాధాన్య‌త గ‌ల ప్రాజెక్టులుగా సుమారు 35వేల కోట్ల రూపాయ‌ల నిధుల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టాల‌ని సంక‌ల్పించారు. ఎవ‌రు అడ్డొచ్చినా ఆ రెండు ప్రాజెక్టులను నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో పూర్తి చేసి తీరుతామ‌ని భ‌రోసా ఇవ్వ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆనందోత్స‌హాలు వెల్లివిరిశాయి. త‌మ గోస తీర‌బోతుంద‌న్న విశ్వాసం మొల‌కెత్తింది. ఇదిలా ఉంచితే- ఇప్ప‌టివ‌ర‌కు ఏనాడూ మాట్లాడ‌ని సీమాంధ్ర నేత‌ల‌కు ఆ రెండు ప్రాజెక్టుల‌కు నీటికేటాయింపులు, అనుమ‌తులు లేవ‌ని గుర్తుకొచ్చింది. వాస్త‌వ విరుద్ధంగా, బాధ్య‌తారాహిత్యంగా తెలంగాణా ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసేలా మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. ఆ ప్రాజెక్టులు ముందుకు సాగ‌కుండా అడ్డుకోవ‌డానికి కుట్ర‌లు, కుతంత్రాలు ఎందుకు చేస్తున్నారో ప‌సిగ‌ట్ట‌లేని స్థితిలో తెలంగాణ స‌మాజం లేదు. త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం స‌న్నాయి నొక్కులు నొక్కే తెలంగాణ నేత‌లూ కొంద‌రు లేక‌పోలేదు. కాని ఇక్క‌డొక‌టి గ‌మ‌నించాలి. మాన‌వ‌త్వం ఉన్న ఏ ప్ర‌జాప్ర‌తినిధిని గానీ, రాజ‌కీయ ప‌క్షం గానీ అత్యంత ప్రాధాన్య‌తాక్రమంలో చేప‌ట్టాల్సిన డిండి, పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టుల‌ను ఏదో కార‌ణాలు చేప్పి అడ్డుకోవాల‌నుకోవ‌డం దుర్మార్గం, బాధ్య‌తారాహిత్యం. ఈ విష‌యంలో తెలంగాణేత‌ర నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ, తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధులు, రాజ‌కీయ‌ప‌క్షాలు, పౌర‌స‌మాజం తెలంగాణ ప్ర‌భుత్వ సంక‌ల్పానికి నిల‌బ‌డి యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేసేందుకు స‌హ‌క‌రించాలి. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న చిర‌కాల స్వ‌ప్పం నెర‌వేరుతున్న స‌మ‌యంలో దాన్ని చిధ్రం చేస్తామంటే ఊరుకునే స్థితి లేదు.

“ నాయ‌కుడికి సరైన భావాల‌ను ఏర్ప‌డ‌టానికి ప్ర‌జ‌ల నుంచి ఆలోచ‌న‌లు, ఆక్షాంక్ష‌లు,భావాలు తీసుకుని వాటిని స‌మీక్షించాలి. త‌ర్వాత ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్లి వాటిని వారు త‌మ‌విగా భావించి, స్వీక‌రించే వ‌ర‌కు ప‌ట్టుద‌ల‌తో వివ‌రిస్తూ ప్ర‌చారం చేయాలి. వాటిని ఆచ‌రించాలి. ఇదే నాయ‌క‌త్వానికి ప్రాథ‌మిక ప‌ద్ధ‌తి“- అని చైనా విప్ల‌వ సార‌థి, ఆధునిక చైనా నిర్మాత మావో సెటూంగ్ చెప్పాడు. ప‌ద‌మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్ర‌సాధ‌న ఉద్య‌మంలో తెలంగాణ ప‌ట్ల స‌మైక్యాంధ్ర పాల‌కుల వివ‌క్ష‌, అన్యాయం, అణ‌చివేత‌, దోపిడి, వాటికి ప‌రిష్కారాలు త‌దిత‌ర అంశాల‌పై కేసీఆర్ స‌రిగ్గా అదే ప‌నిచేశారు… నిల‌బ‌డ్డారు…,కొట్లాడారు…,గెలిచాడు… ఆ సంకల్ప‌సిద్ధితోనే తెలంగాణ ప్రయోజ‌నాల‌కు ప్ర‌తీక‌గా ప్ర‌జ‌లు ఆయ‌న్నే గుర్తించారు. దాన్ని తెలంగాణ రాజ‌కీయ ప‌క్షాలు గుర్తెరిగి- తెలంగాణ స‌మాజం ఆకాంక్ష‌లు, అవ‌స‌రాలు నెర‌వేర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుల‌కు నిర్మాణ‌త్మ‌క మ‌ద్ధ‌తు ఇవ్వాలి. అంతేగానీ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం కావ‌డం మూలాన ప్ర‌జ‌లకు దూర‌మ‌వుతార‌న్న‌ది గ‌మ‌నించాలి.

-ప‌ల్లె ర‌వి కుమార్‌
ఉపాధ్య‌క్షుడు, తెలంగాణ జ‌ర్న‌లిస్టుల ఫోర‌మ్‌(టిజెఎఫ్‌)

email: palleravi@live.com