కోర్టుకు రావాలని మహేష్ కు ఆదేశం

హీరో మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం కథ 2012 సంవత్సరం లో స్వాతి మాసపత్రిక లో చచ్చేంత ప్రేమ అనే నవల ను శ్రీమంతుడు  చిత్రం గా మలచారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేశారు..అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా ఇచ్చింది మళ్ళీ దీనిపై ఈరోజు విచారించిన నాంపల్లి కోర్ట్ సెక్షన్  కాపీ రైట్స్  యాక్ట్ 63 కుట్ర పూరిత నేరం భారతీయ శిక్షా స్మృతి 120 బి కింద కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించాడు…వాదోపవాదనలు విన్న కోర్ట్ ఈరోజు ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కు మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్ కు చిత్ర దర్శకుడు కొరటాల శివ లను మార్చి 3 వ తేదీన  నాంపల్లి కోర్ట్ కు హాజరు కావాలని ఆదేశించింది.

ఎన్టీఆర్ జీవితంపై సినిమా : బాలయ్య

నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించారు బాలకృష్ణ. ఇప్పటికే కథ చర్చలు, కథనం రెడీ అవుతుందని చెప్పి సంచలనం రేపారు. ప్రజలకు తెలియని విషయాలను చూపిస్తానని తెలిపారు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో 30 పడకల ఆస్పత్రికి భూమిపూజ చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేసి కలకలం రేపారు బాలయ్య. ఎన్టీఆర్ సినిమాలో హీరోగా నేనే నటిస్తున్నానని స్పష్టం చేశారు. డైరెక్టర్, నిర్మాత, బ్యానర్ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఈ సినిమాను కొందరు కుటుంబ సభ్యులు వద్దని.. మరికొందరు తీయాలి అంటున్నారు.. నేను మాత్రం సినిమా తీయటానికే రెడీ అయినట్లు తెలిపారు. అన్ని కోణాలను మూవీలో చూపిస్తానని చెప్పారు. చంద్రబాబును విలన్ గా చూపిస్తారా.. హీరోగా మలుస్తారనే అనేది ఆసక్తి. లక్ష్మీపార్వతి క్యారెక్ట్ ఎవరు చేస్తారు.. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, భువనేశ్వరి, దగ్గుబాటి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి రేపుతోంది. వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన కుట్రను ఎలా ప్రజంట్ చేయబోతున్నారు అనేది ఇప్పడు అందరినోట హాట్ టాపిక్ అయ్యింది.

ప్రభాస్ బర్త్ డే కానుకగా ‘బాహుబలి – 2’ ట్రైలర్

bahubali21బాహుబలి – 2 కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాహుబలి: ది బిగినింగ్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. రెండో భాగంలో ఏం చెప్పనున్నాడా.. ఏం చూపించనున్నాడా అన్న ఆసక్తి అందిరిలోనూ ఉంది. దీనికి సంబంధించిన ప్రతివార్తా సెన్సేషనలే అవుతుంది. ప్రస్తుతం రాజమౌళి టీమ్ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. బాహుబలి: ది కన్ క్లూజన్ కి సంబంధించి స్వీట్ న్యూస్ అందించారు జక్కన్న.  అక్టోబర్ 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా ట్రైలర్‌ లేదా టీజర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇది రిలీజ్ అయితే.. కట్టప్ప, బాహుబలి చుట్టూ తిరిగిన చాలా ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ అభిమానులు.

కోలీవుడ్‌లో జెండా పాత‌డ‌మే బ‌న్నీ టార్గెట్‌

allu-arjun-bunny

స్టైలిష్ స్టార్ బన్నీ కోలీవుడ్ లో కూడా జెండా పాతేందుకు సిద్ధమవుతున్నాడు. తన చిత్రాలన్నీ డబ్బింగ్ రూపంలో తమిళంలో విడుదలవుతున్నా.. నేరుగా సినిమా చెయ్యాలని బన్నీ చాలా కాలంగా వేయిట్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో రీసెంట్ గా తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించేలా లింగుస్వామి బన్నీకి ఓ కథ చెప్పాడట.దీంతో బన్నీ ఈ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ ఎంతకాలంగా ఆశపడుతున్న కోలీవుడ్ తెరంగేట్రం నిజం కాబోతుంది. కోలీవుడ్లో బన్నీని పరిచయం చేస్తూ.. తాజాగా స్టూడియోగ్రీన్ నిర్మాణ సంస్థ చెన్నైలో ఈ మూవీని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లు అర్జున్ని కోలీవుడ్కి ఆహ్వానించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. అదే ఏడాది చివర్లో సినిమా విడుదల చేయ్యాలని నిర్మాత జ్ఞన వేల్ రాజా ప్రకటించాడు.

మెగా హీరోల చేతిలో మోసపోయిందట..!!

బాలీవుడ్ 1920 సినిమాలో సూపర్బ్ యాక్టింగ్ తో అదరగొట్టిన అదా శర్మ తెలుగులో పూరి డైరక్షన్లో హార్ట్ ఈటాక్ అంటూ అభిమానులను పలకరించింది. అయితే ఆ సినిమా తర్వాత సినిమా సెలెక్షన్ విషయంలో తప్పటడుగులేసిన ఈ అమ్మడు ప్రస్తుతం కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేదు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కేవలం చిన్న పాత్రతో సరిపెట్టుకున్న అదా శర్మ రీసెంట్ గా వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో కూడా ఫ్యాన్స్ ని నిరాశ పరించింది.

అయితే మెగా హీరోలిద్దరు తనని మోసం చేశారని అంటుంది అదా శర్మ. అసలైతే సుబ్రమణ్యం సినిమాలో సాయితో కొన్ని సీన్లు ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని ఒప్పించారట. కాని సినిమా లెంథ్ ఎక్కువ అవ్వడంతో ఆ సీన్లు కట్ చేశారని అంటుంది. అయితే ఇలానే చేస్తే అమ్మడు కెరియర్ అంతా ఇలా చిన్నా చితకా పాత్రలకే పరిమితం అవుతుంది.

అందుకే తనని మెగా హీరో మోసం చేశాడని అంటుంది. ప్రస్తుతం ఆదితో గరం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న అదా శర్మ ఇకనుండి అలాంటి సినిమాలు చేసేదే లేదంటుందని అంటుంది. అయితే తన సినిమాల సెలెక్షన్ విషయంలో ఎవరి ప్రభావం ఉంటుందో దానిమీద జాగ్రత్త పడితే సరి.

అయితే సుబ్రమణ్యం విషయంలో మెగా హీరోల మీద మండిపడుతుంది కాని అసలు కారణం దర్శక నిర్మాతలే అలా చేశారని అమ్మడికి తెలిస్తే బెటర్. అనవసరంగా మెగా ఫ్యాన్స్ కోపానికి గురైతే అమ్మడికి రావాల్సిన సినిమా ఛాన్సెస్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి కెరియర్ విషయంలో కాస్త ఇప్పటికైనా జాగ్రత్త వహిస్తే మంచింది.