సచిన్ తర్వాత కోహ్లి ఒక్కడే

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. విజ్డన్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌పై కోహ్లి ఫొటోను పబ్లిష్ అయ్యింది. 2017 విజ్డన్ మ్యాగజైన్‌ తాజాగా రిలీజ్ అయ్యింది. 2016లో కోహ్లి చేసిన అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంది. స్వీప్ షాట్ కొడుతున్న కోహ్లి ఫొటోను ఇక్కడ ఉపయోగించారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లి 2595 పరుగులు చేశాడు. వీటిల్లో మూడు డబుల్ సెంచరీలున్నాయి. సచిన్‌ తర్వాత.. కోహ్లికే ఈ అరుదైన గౌరవం దక్కింది. 2014 మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌పై సచిన్‌ ఫొటోను ప్రచురించింది. స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌, ఏబీ డివిలియర్స్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లను వెనక్కి నెట్టి కోహ్లి ఈ ఘనత సాధించాడు. కోహ్లి ఆధునిక క్రికెట్ లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడని.. అతన్ని గౌరవించడానికి ఇదే సరైన సమయమంటూ కితాబిచ్చారు విజ్డన్ అధికారులు.

అశ్విన్‌, జడేజా ఔట్

ఇంగ్లండ్ తో ట్వంటీ-20 సిరీస్ కు కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ ను తప్పించింది. కొత్త వాళ్లకు చోటు ఇచ్చింది. విశ్రాంతి అని చెబుతున్నా.. కుర్రోళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ 20-20 మ్యాచ్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజాలను పక్కనబెట్టారు. కొన్ని రోజులుగా తీరికలేకుండా వీరిద్దరూ మ్యాచ్ లు ఆడుతున్నారని సెలక్షన్ కమిటీ తెలిపింది. వీరిద్దరి ప్లేస్ లో అమిత్‌ మిశ్రా, పర్వేజ్‌ రసూల్‌ కు చోటు దక్కింది. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాన్పూర్ వేదికగా జనవరి 26 నుంచి మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

భారత్ టార్గెట్ 322

భారత్ – ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో మరోసారి భారీస్కోర్ నమోదైంది. కోల్ కతా వన్డేలో 300 పైన పరుగులు సాధించారు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్. 50 ఓవర్లు పూర్తయ్యే నాటికి 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో రాయ్(65), స్టోక్(57 నాటౌట్), బెయిర్ స్టో(56) అత్యధిక పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో పాండ్యా(3), జడేజా 2, బూమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.

మలేషియా టైటిల్ గెలిచిన సైనా

హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనల్లో విజయం సాధించింది.  సైనా నెహ్వాల్ 22-20, 22-20 తేడాతో థాయ్ లాండ్ కు చెందిన పోర్న్‌పవీ చోచువోంగ్‌ పై విన్ అయి టైటిల్ సొంతం చేసుకుంది.  గతేడాది రియో ఒలింపిక్స్ అనంతరం పలు టోర్నీలకు దూరమైన సైనా.. మళ్లీ ఫామ్ లోకి వచ్చి టైటిల్ ను కైవసం చేసుకుంది.  46 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ టోర్నీ జరిగింది. ఈ పోరులో సైనాను విజయం వరించింది.

ధోనీ సెంచరీ – యూవీతో కలిసి రికార్డ్

కటక్ వన్డేలో ధోనీ చెలరేగిపోయాడు. కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత సెంచరీ చేయటం ఇదే. 106 బంతుల్లో 100 పరుగులు చేశాడు మిస్టర్ కూల్. తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స్ లతో కటక్ స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ధోనీ రన్స్ తీస్తుంటే.. అభిమానుల స్లోగన్స్ తో కటక్ దద్దరిల్లింది. ఎలాంటి టెన్షన్ లేకుండా.. చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేశాడు. ఆచితూచి ఆడుతూనే.. గ్రౌండ్ చుట్టూ ఫోర్లు బాదేశాడు. మూడు వికెట్లు పడిన తర్వాత క్రీజ్ లోకి ధోనీ.. మొదట్లో నిలకడగా ఆడినా.. ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. ధోనీ కెరీర్ లో ఇది 10వ సెంచరీ.

యూవీతో కలిసి రికార్డ్

ధోనీ సెంచరీ చేయటమే కాదు.. యువరాజ్ సింగ్ తో కలిసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. నాలుగో వికెట్ పార్టనర్ షిప్ కు 176 పరుగులు చేయటం ఓ రికార్డ్. 2012లో సౌతాఫిక్రా జోడీ ఆమ్లా-డివిలిర్స్ ఇంగ్లండ్ పై 172 పరుగులు చేశారు. ఆ రికార్డ్ ను ధోనీ-యువరాజ్ బ్రేక్ చేశారు.

దేవుడా.. నన్ను ఆశీర్వదించు

కెప్టెన్ గా ధోనీ చివరి వన్డే మ్యాచ్ ఓడినా.. తీపి గుర్తులను మాత్రం పదిలపరుచుకున్నాడు. పేరుకు ప్రాక్టీస్‌ మ్యాచే అయినా.. ఇంటర్నేషనల్ మ్యాచ్ లా మారిపోయింది. బ్రబౌర్న్‌ స్టేడియంకు ఫ్యాన్స్ పోటెత్తారు. ధోని భారత్‌ తరఫున చివరిసారిగా కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండటంతో స్టేడియానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధోని బ్యాటింగ్‌కు దిగుతున్న సమయంలో అయితే హోరు మామూలుగా లేదు. అభిమానులంతా లేచి నిలబడి చప్పట్లతో ‘కెప్టెన్‌ కూల్‌’ను స్వాగతించారు. ధోని ఆడుతుండగా ఓ అభిమాని స్టాండ్స్‌ నుంచి మైదానం లోపలికి దూకేసి.. భద్రత సిబ్బందిని తప్పించుకుని పిచ్‌ వద్దకు వచ్చేశాడు. ధోని దగ్గరికి వచ్చి అతడి పాదాల్ని కూడా తాకేశాడు. అయితే అతనిపై అసహనం ప్రదర్శించకుండా.. షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేశాడు ధోనీ. ఇంకో విషయం ఇలా గ్రౌండ్ లోకి రావడం తప్పంటూ.. అతన్ని హెచ్చరించి మరీ పంపాడు మహీ.

కెప్టెన్ గా ధోని చివరి మ్యాచ్ అదుర్స్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశారు. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీలు చేశారు. సిక్సర్లు, బౌండరీలతో అభిమానులను అలరించారు. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు సెంచరీతో.. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌-ఎ 5 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ముంబై బ్రాబౌర్నె వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన భారత్-ఎ మొదట బ్యాటింగ్ కు దిగింది. 25 పరుగుల దగ్గరే ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ (8) వికెట్‌ కోల్పోయినా… శిఖర్‌ధావన్‌ (63) నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. 136 పరుగుల దగ్గర శిఖర్‌.. జే.బాల్‌ బౌలింగ్‌లో బట్లర్‌ చేతికి చిక్కడంతో యువరాజ్‌ సింగ్‌ (56) బరిలోకి దిగాడు. మొదటి పది బంతులు నిలకడగా ఆడినా యువీ ….ఆ తర్వాత సిక్సర్లతో రెచ్చిపోయాడు. అంతకు ముందే హాఫ్ సెంచరీ చేసిన అంబటి రాయుడు సెంచరీ చేశాడు. రాయుడు రిటైర్డ్‌ ఔట్గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోని (68) ప్రత్యర్థి బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా ఉన్నాడు. సామ్ సన్ డక్ ఔట్ అయ్యాడు. మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయిన భారత్-ఎ 304 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు 305 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

ఆ పక్షి కోసం ఆటనే ఆపేశాడు..

ఫుట్ బాల్ కప్ ఫైనల్ మ్యాచ్ అది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాల్ ఒకవైపు నుంచి మరోవైపుకి … కిక్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇంతలో కొన్ని సముద్రపు కాకులు గ్రౌండ్ లో వాలాయి. ఆ సముద్రపు కాకుల్లో ఒక దానికి బాల్ తగిలి అక్కడి ఉండిపోయింది. అయినా బాల్ ను గోల్ పోస్టులోకి పంపించేందుకు పరుగులు పెడుతున్నారు ఆటగాళ్లు. అయితే సముద్రపు కాకి కష్టాన్ని చూసిన సిడ్నీ గోల్ కీపర్ మ్యాచ్ ను నిలపండి అంటూ సైగలు చేయడం మొదలు పెట్టారు. అయినా మ్యాచ్ కొనసాగుతూనే ఉంది. అప్పటికే ఆలస్యం అవుతుండటంతో తనే కాకిని తీసి గ్రౌండ్ బయటకు వెళ్లి అందించి వచ్చాడు. దాన్ని చూసిన ప్రేక్షకులు ఆ గోల్ కీపర్ ఔన్నత్యాన్ని చప్పట్లతో అభినందించారు. కొద్ది సేపటికి తేరుకున్న కాకి అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. స్వేచ్ఛా విహంగాన్ని చూసి అందరూ హమ్మయ్య అనుకున్నారు.

ఈడెన్ విక్ట‌రీ: నెంబ‌ర్ వ‌న్ స్థానానికి భార‌త్

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన‌ రెండో టెస్టులో కివీస్‌పై విజ‌య‌బాహుటా ఎగుర‌వేసింది టీమిండియా.  మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తోగెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది భార‌త్‌. ఈడెన్ విక్ట‌రీతో భార‌త్  ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంది.
376 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ భార‌త్ బౌల‌ర్ల ధాటికి త‌ట్టుకోలేక‌పోయింది. ఫ‌లితంగా 178 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆదినుంచే త‌డ‌బ‌డింది. టీ విరామ స‌మ‌యానికి న్యూజిలాండ్ జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసి క‌ష్టాల్లో ప‌డింది. అయితే ఓపెన‌ర్ లాథ‌మ్ 74 ప‌రుగులు చేసి ఆ జ‌ట్టును కాపాడే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క్ర‌మంలోనే లోథ‌మ్‌ను పెవిలియ‌న్ బాట ప‌ట్టించాడు భార‌త స్పిన్న‌ర్ అశ్విన్. కీల‌కమైన‌ లోథ‌మ్ వికెట్‌తో పాటు మ‌రో రెండు వికెట్లు ప‌డ‌గొట్టి  కివీస్ వెన్ను విరిచాడు అశ్విన్‌.

అంత‌కుముందు 227 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్‌.. వృద్దిమాన్ సాహా మ‌రోసారి హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో భార‌త్ 263 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. చివ‌ర్లో టెయిలెండ‌ర్స్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ (23), ష‌మీ (1)తో చ‌క్క‌టి స‌హ‌కారం అందించారు. తొలి ఇన్నింగ్స్ లో 54 పరుగులు రెండో ఇన్నింగ్స్ లో 58 కీలక పరుగులు  చేసిన వృద్ధిమాన్ సాహాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. చివ‌రి టెస్టు ఇండోర్‌లోని హోల్క‌ర్ క్రికెట్ స్టేడియంలో అక్టోబ‌ర్ 8 నుంచి 12 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

భార‌త్ 316 ఆలౌట్‌, కివీస్ 21/2

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండ‌వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 316 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఏడు వికెట్ల‌కు 239 ప‌రుగుల వ‌ద్ద‌ రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ మ‌రో 77 ప‌రుగులు జోడించి మూడు వికెట్ల‌ను కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా 54 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇవాళ ఉదయం తొలి సెషన్ లో జడేజా (14), భువనేశ్వర్ (5), షమీ (14) ఔటయ్యారు. కివీస్ బౌల‌ర్ హెన్రీ మూడు వికెట్లు తీసుకోగా, బోల్ట్‌, వాగ్న‌ర్‌, ప‌టేల్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 21 రన్స్ చేసింది. టేలర్, నికోలస్ క్రీజ్ లో ఉన్నారు. భువనేశ్వర్, షమీలు చెరో వికెట్ తీసుకున్నారు.
భార‌త్ స్కోర్
తొలి ఇన్నింగ్స్ 316 (పుజారా 87, ర‌హానే 77, సాహా 54 నాటౌట్‌ )