కేంద్రాన్ని నిలదీస్తాం

మార్చి 5వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశంలో అనేక అంశాలు అమలు కాలేదని, పెద్ద ఎత్తున కేంద్రాన్ని నిలదీయాలని చర్చించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. రిజర్వేషన్లను కేంద్రం దగ్గరపెట్టుకోవడం సరికాదని, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా..కేంద్రం నుంచి సరైనా క్లారిటీ రాలేదన్నారు. కేంద్రం తీరుపై పోరాడాలని నిర్ణయించామన్నారు.

70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత  ఈ రిజర్వేషన్లు కేంద్రం దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదని.. శాసన సభలో తీర్మానం చేసినప్పుడు  ఈ మాట బలంగా చెప్పి పంపించామన్నారు. ఉద్యోగాలు, విద్యా అవకాశాలు ఇచ్చే రిజర్వేషన్లను మా రాష్ర్టాల పరిధిలో ఇస్తున్నం కాబట్టి కేంద్రం నుంచి అడుగుతలేమని..  అది మీదగ్గర పెట్టుకోకండి అని చెప్పా మన్నారు. దాని మీద స్పందన లేదు. లేకపోగా.. సేమ్ అదే పాత పద్ధతిని కొనసాగిస్తామని కేంద్రం చెబుతున్నదని… ఈ విషయంపై కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తమన్నారు. రిజర్వేషన్ల గురించి సుప్రీం కోర్టు చెప్పినట్లుగా రాజ్యాంగ సవరణ చేయొచ్చు. పెద్ద కష్టమేమి కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండే అది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆర్టికల్ 16ను సవరణ చేయొచ్చు. బిల్లు కూడా పాస్ అవుతుంది. కాకపోతే కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ల గుప్పిట్లో పవర్ పెట్టుకోవాలని కూర్చుంటున్నదన్నారు సీఎం.

నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఎంపీలు పోరాటం చేస్తారని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. ఎయిమ్స్..కాజీపేట రైల్వే కోచ్ లాంటి విషయాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. తెలంగాణలో అనేక పథకాలు ప్రవేశపెట్టి, దేశంలోనే గర్వించతగ్గ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. తమ స్కీములో గోప్యంగా ఉండవని..ప్రజలకు తెలిసేలా ఉంటాయన్నారు. ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుందని, పట్టాదారు పాస్ పుస్తకాలు..కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు సీఎం కేసీఆర్.

అస్టిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు Phd తప్పనిసరి

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పీహెచ్‌డీని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) తప్పనిసరి చేసింది. 2021 జూలై 1 తరువాత చేపట్టే నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది UGC. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో పదోన్నతికీ Phd ఉండాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలికం.. పేరేదైనా ఉన్నత విద్యా సంస్థలకు మంజూరైన పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది 10 శాతానికి మించకూడదు. ఈ మేరకు వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది నియామకాలకు సరికొత్త నిబంధనలు రూపొందించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌.

సీనియర్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్‌ తదితర పోస్టుల భర్తీ, పదోన్నతులు, అర్హతలు, పనిదినాలు, అకడమిక్‌ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలను రూపొందించింది UGC. ఈ అంశాలపై ఈ నెల 28లోగా అభిప్రాయాలు తెలపాలని వర్సిటీలు, కాలేజీలను కోరింది. అభిప్రాయ సేకరణ తరువాత తుది మార్గదర్శకాలను జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో త్వరలో భర్తీ చేయనున్న 1,061 పోస్టులకూ ఈ నిబంధనలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు

*  ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పీహెచ్‌డీ  ఉండాలి.
*    అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులుండాలి. అలాగే నెట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీలలో ఒక అర్హత ఉండాలి.
*  1991 సెప్టెంబర్‌ 19కి ముందు పీహెచ్‌డీ చేసిన వారికి పీజీలో 50% మార్కులున్నా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులున్నా చాలు.
*    2021 జూలై 21 తరువాత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్‌డీ ఉండాల్సిందే.
*  విద్యా సంస్థలో మంజూరైన మొత్తం పోస్టుల్లో తాత్కాలిక అధ్యాపకులు 10 శాతానికి మించకూడదు.
*    పేరేదైనా తాత్కాలిక పద్ధతిలో పని చేసే అధ్యాపకులకు రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా వేతనమివ్వాలి.
*   కనీసం 180 పని దినాలు అమలు చేయాలి. వారంలో 6 రోజుల పనిదినాలు ఉంటే.. విద్యా సంవత్సరంలో 30 వారాలు ప్రధాన బోధన కొనసాగించాలి.
*    మిగిలిన సమయంలో 12 వారాలు ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, పాఠ్య కార్యక్రమాలు, స్పోర్ట్స్, కాలేజ్‌డే కార్యకలాపాలకు కేటాయించాలి.
*    8 వారాలు సెలవులు, 2 వారాలు ప్రజా సెలవులకు కేటాయించాలి.
*    వారంలో 40 గంటలకు తక్కువ కాకుండా పనిదినాలు ఉండాలి. రోజుకు 7 గంటలు అధ్యాపకులు కాలేజీలో ఉండాలి.
*    విద్యార్థులకు వివిధ అంశాలపై మార్గదర్శనం కోసం 2 గంటలు కేటాయించాలి. కమ్యూనిటీ డెవలప్‌మెంట్, సాంస్కృతిక, గ్రంథాలయ కార్యక్రమాలకు సమయమివ్వాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భర్తీలో..

-అకడమిక్‌ స్కోర్‌కు 80 మార్కులు
-రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌కు 10 మార్కులు
-బోధన అనుభవానికి 10 మార్కులు
-మొత్తంగా 100 మార్కులు

అకడమిక్‌ స్కోర్‌లో గరిష్టంగా ఇచ్చే మార్కులు

♦డిగ్రీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 15 మార్కులు
♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 13 మార్కులు
♦55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 10 మార్కులు
♦ పీజీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 28 మార్కులు
♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 25 మార్కులు
♦ 55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 20 మార్కులు
♦ ఎంఫిల్‌లో 60 శాతానికి పైగా మార్కులొస్తే.. 7 మార్కులు
♦ 55 నుంచి 60 శాతం లోపు మార్కులుంటే 5 మార్కులు
♦ పీహెచ్‌డీకి 30 మార్కులు
♦ నెట్, జేఆర్‌ఎఫ్‌ ఉంటే 7 మార్కులు
♦ నెట్‌/సెట్‌/స్లెట్‌ ఉంటే 5 మార్కులు

జర్నలిస్ట్ ల దుఃఖం అంతం కావాలి: కేసీఆర్

దేశం సంగతి బాగానే రాస్తారు గానీ.. మీ సంగతి బాగాలేదన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ లోని జనహిత హాల్లో సీఎం 69 మంది చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. జర్నలిస్టు కుటుంబాలు తనకు హృదయవిదారక విషయాలు చెప్పారన్నారు. ఇళ్లు లేని కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే కేటాయిస్తామన్నారు.

ఇది చాలా చక్కటి కార్యక్రమం అన్నారు కేసీఆర్. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,ప‌ల్లె ర‌వి కుమార్ టీంకి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష రూపాయలే కాకుండా.. నెలకు రూ. 3 వేల పింఛన్ అందిస్తామన్నారు. జర్నలిస్టు కుటుంబాల్లో పెళ్లికాని అమ్మాయిలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. పిల్లల చదువుకోసం ప్రెస్ అకాడమీ రూ.వెయ్యి ఇస్తోందన్నారు. జర్నలిస్టు పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో దు:ఖం అంతం కావాలన్నారు. సమస్యలుంటే ప్రెస్ అకాడమీ తెలియజేయమన్నారు.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను సంప్రదించాలన్నారు. స్పెషల్ కేసులుగా పరిగణించి జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. మీడియా ఆర్గనైజేషన్స్ జర్నలిస్టులకు ప్రావిండెంట్ ఫండ్, ఈఎస్ఐ తప్పకుండా కట్టాలన్నారు. జర్నలిస్ట్ ఫండ్ కోసం రూ.20 కోట్ల ఇప్పటికే ఇచ్చాం.. మరో 30 కోట్ల రూపాయలను రాబోయే బడ్జెట్ లో కేటాయిస్తామన్నారు. రూ.50 కోట్లకు కూడా పెంచుకుందామన్నారు. దేశంలోనే జర్నలిస్టుల వెల్ఫేర్ స్టేట్ గా ఎదగాలన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి పాటుబడుతున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. బాధిత కుటుంబాలను తీసుకొచ్చిన జిల్లా రిపోర్టర్ లకు ధన్యవాదాలు తెలిపారాయన.

జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులందజేసిన కేసీఆర్

ప్రజలను నేరుగా కలుసుకునేందుకు జనహిత భవన్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. తొలి రోజు జనహిత భవన్లో జర్నలిస్టు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 84 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అందజేశారు.

చనిపోయిన స్పోర్ట్స్‌ జర్నలిస్టు శ్రీనివాసులు కుటుంబానికి సీఎం రూ.4 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

7306 పోస్టులకు TSPSC నోటిఫికేషన్

గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గురుకులాల్లో 7306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరణ చేపట్టనున్నారు.

కరీంనగర్ నగరాభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష

కరీంనగర్ నగరాభివృద్ధిపై ఫోకస్ పెట్టింది సర్కార్. పట్టణంలో 24 గంటలు నీటి సరఫరా చేయాలని నిర్ణయించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, రోడ్ల వెడల్పు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర మత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్. నగరంలోని మంచినీటి రవాణా వ్యవస్థపై ఆరాతీశారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  కరీంనగర్ లో 24 గంటల నీటి సరఫరాకు త్వరలోనే 150 కోట్లతో పనులు చేపడతామన్నారు మంత్రి. రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తామన్నారు. నగరంలో రోడ్ల వెడల్పు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని.. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు కేటీఆర్. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఫ్లెక్సీలు పెట్టేవారు ఏపార్టీ వారైనా… ఊరుకోవద్దన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలపై తెలంగాణ ప్రవాస భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. NRIల ఇబ్బందులపై త్వరలోనే సీఎంతో మాట్లాడి.. ప్రత్యేక బృందంతో అమెరికాకు నివేదిక ఇస్తామని చెప్పారు. అంతకుముందు మంత్రికి ఘనస్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అలుగునూరు చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

సిగ్గూ, ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు: కేసీఆర్

పాలేరు బహిరంగ సభ సాక్షిగా కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఠాగా ఏర్పడి ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధిని చూస్తూ జరగలేదని అంటూ అసత్యప్రచారం చేస్తున్నారంటూ  మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిదంబరంపై సూటిగా ప్రశ్నలు సంధించారు.

.. కాంగ్రెస్ నాయకులు కలిగిస్తున్న ఆటంకాలను, నాటకాలు చూస్తూనే ఉన్నారు.

.. సంబంధం లేని వాళ్లు.. ముఠాను తయారు చేసి… ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పిటిషన్ లు వేస్తున్నారు.

.. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. సిగ్గుఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.

… కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు చిదంబరం.

.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేయనటువంటి అభివృద్ధి ఇక్కడ చేస్తున్నాం.

.. పెన్షన్లు ఇస్తున్నాం.. ఒంటరి మహిళలకు రాబోయే ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు ప్రకటించాం.

.. 17500 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది ఎవరు?

.. గుడ్డివాళ్లా మీరు.. కళ్లు కనపడవా మీకు

… డబ్బాలాంటి ఇళ్లు కట్టించి పేదల కర్మకు వదిలేశారు. ఐదు లక్షల పైన ఖర్చు తో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తున్నాం.

… జిల్లాల విభజనను పట్టించుకోలేదు. మొత్తం 21 జిల్లాలు ఏర్పాటు చేశాం.

… కేజీ టు పీజీ విద్య అందిస్తున్నాం.

.. ఏ నోటితో మాట్లాడారు చిదంబరం …

.. పేద విద్యార్థుల కోసం 21 లక్షలతో విదేశీ చదువులు కల్పిస్తున్నాం.

.. 501 రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం.

.. ఇందిర గాంధీ బొమ్మ చూపించి ఓట్లు దండుకున్నారు

.. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాది

.. న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లు, బ్రాహ్మణుల కోసం రూ.100 కోట్లు,

… జర్నలిస్టుల కోసం రూ.10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశాం.

.. కలలో సైతం ఊహించని పథకాలు తీసుకొచ్చాం.

.. కాంట్రాక్టు ఎంప్లాయ్ లను రెగ్యులరైజ్ చేసిన ఘనత మాది.

.. వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ మినహాయింపులు చేశాం.

.. ఆటో రిక్షాలకు పన్ను రద్దు చేసింది మేమే..

.. డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్దరించాం.

.. టీపాస్ ఐపాస్.. తీసుకొచ్చింది కూడా మేమే.

.. ఇవన్నీ కనపడక మీ కళ్లు బైర్లు కమ్ముకున్నాయి… అందుకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.

.. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు కనపడటం లేదని.. హైదరాబాద్ లో ఈ దుకాణాలు బంద్ అయ్యాయి.

.. నిరంతరం విద్యుత్ అందిస్తున్నాం.

.. గ్రామాలు, పట్టణాల్లో కరెంట్ ఇబ్బందులు లేకుండా చేశాం.

నేలకొండపల్లిలో భక్తరామదాసు మెమోరియల్: కేసీఆర్

దశాబ్దాల కరువు నుంచి బయటపడ్డ పాలేరు ప్రజలకు శుభాభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందోనన్న ప్రశ్నలకు పాలేరు ప్రజలు సమాధానం చెప్పారని తెలిపారు. 11 నెలల కాలంలో అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేశారని అభినందించారు. ఈ ప్రాజెక్టుతో మా ఊరికి కూడా నీల్లు వస్తున్నాయంటూ.. హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. మీలో ఒకడిగా పాలేరు బిడ్డగా సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చారు.

… చాలా కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడితే హేళనలు.. జోకులు వేసేవాళ్లు. ఒక సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రం ఇది. భూములు పచ్చబడేవరకు ప్రాణం పోయినా సరే విశ్రమించేది లేదు.

భక్త రామదాసు స్ఫూర్తితో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: హరీశ్

కరీంనగర్ సింహగర్జనను గుర్తు చేసుకున్నారు మంత్రి హరీశ్ రావు. ఆనాటి ఉత్సాహం పాలేరులో ఇవాళ కనిపిస్తోంది అన్నారు. ఈ జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను మళ్లీ వాడుకలోకి తీసుకొచ్చామన్నారు హరీశ్. గత ప్రభుత్వాలు ప్రారంభించి వదిలేస్తే… తాము ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. భక్తరామదాసు స్ఫూర్తితో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు.

కులవృత్తులకు వైభవం

తెలంగాణ పునర్నిర్మాణంలో మరో అడుగు.. విధ్వంసానికి గురైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించే దిశగా బడ్జెట్ రూపకల్పన జరుగుతున్నది. ఈ వార్షిక బడ్జెట్‌లో కులవృత్తులు, చేతివృత్తులకు చేయూతనిచ్చేందుకు భారీగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గ్రామసీమలు స్వయం ఉపాధితో పరిపుష్టం కావాలని, ఆయా కులవృత్తుల్లో ఆర్థిక వికాసం పరిఢవిల్లాల ని సీఎం ఆకాంక్షిస్తున్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులుండ రాదు.. ఆత్మహత్యలు అసలే ఉండకూడదు.. వివిధ కుల వృత్తులు నిలదొక్కుకునేలా శాశ్వత ప్రాతిపదికన పటిష్ఠ చర్యలు తీసుకోవాలి అనేది సీఎం దిశానిర్దేశమని, ఇందు కోసం ఎన్ని నిధులైనా కేటాయించాలన్న భావనతో ప్రభుత్వం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ దిశగా వెనుకబడిన తరగతులలో దాదాపు 12 కులాల ఫెడరేషన్లకు ఆర్థిక చేయూతనందించే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విశ్వబ్రాహ్మణులు, వడ్రంగి, కమ్మరి, కంసాలి, శిల్పులు, కంచరి కుల వృత్తులవారి అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపై కసరత్తు జరుగుతున్నది. కురుమ, గొల్లల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు లక్ష యూనిట్ల మేరకు గొర్రెలను కొనుగోలు లక్ష్యంగా ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది. ఇంకా వివిధ కులవృత్తుల పరిరక్షణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కేటాయింపులపై విస్తృత చర్చ జరుగుతున్నది.
works
సీఎం తీవ్ర కసరత్తు…

రాష్ట్రంలో కీలకరంగాలైన విద్యుత్తు, నీటి వనరులు, పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలను పట్టాలకెక్కించిన అనంతరం ఇపుడు గ్రామాల మీద సీఎం దృష్టి కేంద్రీకరించారు. కులవృత్తుల మీద ఆధారపడిన వారిని ఆదుకోవటం ద్వారానే గ్రామాల ఆర్థిక వికాసం సాధ్యపడుతుందని ఆయన భావిస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురితో జరిపే భేటీల్లో గ్రామాల వికాసానికి, చేతివృత్తుల పునరుజ్జీవానికి సంబంధించి విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఆయా కులవృత్తుల క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా కులవృత్తులనే నమ్ముకొని ఇంకా ఎంతమంది జీవిస్తున్నారు? ఆ కుటుంబాలు ఆత్మగౌరవంతో నిలదొక్కుకొని జీవించాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? భవిష్యత్తు ఎంతమాత్రమూ లేని కులవృత్తుల్లో ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి?అనే విషయమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడమే కాకుండా, తమ తమ కులస్థులతో చర్చించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని పలువురు ప్రజాప్రతినిధులను సీఎం ఆదేశించారు. చేనేత మగ్గాల మీద ఆధారపడ్డ కుటుంబాల క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్న సీఎం, ఆ సంఖ్య పరిమితంగానే ఉండటంతో వారు నేసే వస్ర్తాలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే మత్య్సకారుల సమస్యలు వాకబు చేసి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వమే చేపపిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే దారిలో కురుమ, గొల్లలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ర్టాలనుంచి మేలైన బ్రీడ్ గొర్రెలు తెప్పించి, వారు ఆర్థికంగా గౌరవప్రద జీవితం గడుపగలిగే స్థాయిలో లక్ష యూనిట్లు పంచాలని నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణకారులు తదితర కులాల వికాసం మీద ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. ఇలా అన్ని కులాల సమస్యలు-పరిష్కారాల మీద విస్తృత చర్చలకు ప్రగతి భవన్ వేదిక అవుతున్నది. కులవృత్తుల మీద మాత్రమే ఆధారపడ్డ కుటుంబాలను ఫెడరేషన్ల ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
గ్రామ వికాస బడ్జెట్..   గత పాలకుల అలసత్వం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. నగరాలకు వలసలు పెరిగాయి. కులవృత్తులకు ఆదరణ తగ్గింది. వివిధ కులాలు ఒక దానిపై ఒకటిగా ఆధారపడి సాగిన గొలుసుకట్టు జీవన విధానం గతి తప్పింది. రాష్ట్రంలో ఇపుడు ఎనిమిదివేల సాలెల మగ్గాలు మాత్రమే ఉనికిలో ఉన్నాయంటే కులవృత్తులు ధ్వంసమైన తీరును అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో గ్రామాలకు ప్రధాన వనరుగా ఉన్న గొలుసుకట్టు చెరువులను ప్రభుత్వం చాలా వరకు పునరుద్ధరించింది. ఇప్పుడు గొలుసుకట్టు జీవన విధానానికి పూర్వవైభవం తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నది. మిషన్ కాకతీయ కింద 20వేల చెరువులు బాగుచేసిన ప్రభుత్వం ఇప్పటికే 4,550 చెరువుల్లో దాదాపు 35కోట్ల చేపపిల్లలను వదిలింది. దీని వల్ల మత్య్స సంపద పై ఆధారపడిన వేలాది గంగపుత్ర కుటుంబాల ఉపాధి మెరుగుపడుతున్నది. మత్స్యపరిశ్రమకు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచనున్నట్లు సమాచారం.