పానీపూరీలో టాయ్‌లెట్ క్లీన‌ర్

ఫాస్ట్ ఫుడ్ పేరుతో ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌తో చెల‌గాటం ఆడుకుంటున్నారు కొంద‌రు ఫాస్ట్ ఫుడ్ య‌జ‌మానులు. నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించే కేవ‌లం డ‌బ్బే ప‌ర‌మావ‌ధిగా భావిస్తున్న కొంద‌రు క‌నీస ఆహార భ‌ద్ర‌త‌ను పాటించ‌డం మ‌రిచిపోతున్నారు. తాజాగా గుజ‌రాత్‌లో పానీపూరి అమ్మేవాడు అందులో టాయ్‌లెట్ క్లీన‌ర్ క‌లుపుతున్న‌ట్లు ఆహార ప‌రీక్ష ల్యాబ‌రేట‌రీ అధికారులు ధృవీక‌రించారు.

అహ్మ‌దాబాద్‌కు చెందిన చేత‌న్ నాంజీ అనే వ్య‌క్తి పానీపూరీ సెంట‌ర్‌ను న‌డుపుతున్నాడు. పానీపూరీ టేస్ట్ వేరుగా ఉండ‌టంతో అక్క‌డి స్థానికులు చేత‌న్‌ను నిల‌దీశారు. వారిపై  మాట‌ల‌తో ఎదురుదాడికి దిగాడు. పానీపూరీలు అమ్మ‌గా మిగిలిన వ్య‌ర్థాన్ని అంతా రోడ్డుపైనే పోసి పాద‌చారుల‌కు తీవ్ర ఇబ్బంది క‌లిగించేవాడు. దీంతో స్థానికులు అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ప‌లుమార్లు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ చేత‌న్ తీరు మార‌క‌పోవ‌డంతో మున్పిప‌ల్ అధికారులు పానీపూరీల‌ను, అందులోకి వినియోగించే నీటిని ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీకి పంపించారు.

పానీపూరీని ప‌రీక్షించిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేట‌రీ చేత‌న్ టాయ్‌లెట్ క్లీనర్ వాడిన‌ట్లు నిర్ధారించింది. టాయ్‌లెట్ క్లీన‌ర్‌లో వినియోగించే ఆక్సాలిక్ యాసిడ్ అధిక‌మోతాదులో ఉండ‌టంతో చేత‌న్ బుక్ అయ్యాడు. స్థానిక కోర్టు 6నెల‌లు జైలు శిక్ష విధించింది.

కోర్టుకు రావాలని మహేష్ కు ఆదేశం

హీరో మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం కథ 2012 సంవత్సరం లో స్వాతి మాసపత్రిక లో చచ్చేంత ప్రేమ అనే నవల ను శ్రీమంతుడు  చిత్రం గా మలచారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేశారు..అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా ఇచ్చింది మళ్ళీ దీనిపై ఈరోజు విచారించిన నాంపల్లి కోర్ట్ సెక్షన్  కాపీ రైట్స్  యాక్ట్ 63 కుట్ర పూరిత నేరం భారతీయ శిక్షా స్మృతి 120 బి కింద కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ తరపు న్యాయవాది కోర్ట్ లో వాదించాడు…వాదోపవాదనలు విన్న కోర్ట్ ఈరోజు ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కు మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్ కు చిత్ర దర్శకుడు కొరటాల శివ లను మార్చి 3 వ తేదీన  నాంపల్లి కోర్ట్ కు హాజరు కావాలని ఆదేశించింది.

ఎన్టీఆర్ జీవితంపై సినిమా : బాలయ్య

నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించారు బాలకృష్ణ. ఇప్పటికే కథ చర్చలు, కథనం రెడీ అవుతుందని చెప్పి సంచలనం రేపారు. ప్రజలకు తెలియని విషయాలను చూపిస్తానని తెలిపారు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో 30 పడకల ఆస్పత్రికి భూమిపూజ చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేసి కలకలం రేపారు బాలయ్య. ఎన్టీఆర్ సినిమాలో హీరోగా నేనే నటిస్తున్నానని స్పష్టం చేశారు. డైరెక్టర్, నిర్మాత, బ్యానర్ త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఈ సినిమాను కొందరు కుటుంబ సభ్యులు వద్దని.. మరికొందరు తీయాలి అంటున్నారు.. నేను మాత్రం సినిమా తీయటానికే రెడీ అయినట్లు తెలిపారు. అన్ని కోణాలను మూవీలో చూపిస్తానని చెప్పారు. చంద్రబాబును విలన్ గా చూపిస్తారా.. హీరోగా మలుస్తారనే అనేది ఆసక్తి. లక్ష్మీపార్వతి క్యారెక్ట్ ఎవరు చేస్తారు.. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, భువనేశ్వరి, దగ్గుబాటి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి రేపుతోంది. వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగిన కుట్రను ఎలా ప్రజంట్ చేయబోతున్నారు అనేది ఇప్పడు అందరినోట హాట్ టాపిక్ అయ్యింది.

పోలీసులకు మరో కొత్త బైక్

తెలంగాణ పోలీసులకు మరో కొత్త బైక్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యాధునిక హంగులతో ఇన్నోవాలను పోలీస్ శాఖకు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరింత టెక్నాలజీతో బైక్ లను ఇవ్వాలని డిసైడంది. మూడున్నర లక్షల విలువై హార్లీ డెవిడ్ సన్ కు చెందిన రీగల్ రాప్టర్ బైక్ లను సిద్ధం చేసింది.

బైక్ ప్రత్యేకతలు..

… ఫస్ట్ ఎయిడ్ కిట్

… GPRS సిస్టమ్ ఉంటుంది. వెళ్లాల్సిన స్పాట్, ట్రాఫిక్ రద్దీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెళ్లాల్సిన గమ్యాన్ని చూపిస్తోంది.

… బైక్ లో మైక్ సెట్, మౌంత్ పీస్, వైర్ లెస్ సెట్, రెస్క్యూ ఆపరేషన్ కిట్, సీసీ కెమెరాలు ఫీడ్ చూసుకునే అవకాశం ఉంటుంది.

… ప్రస్తుతం 10 బైక్స్ రోడ్డెక్కటానికి రెడీ అయ్యాయి. ఇవి విజయవంతం అయితే.. మరిన్ని వాహనాలను తీసుకోనున్నారు.

… ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది. పోలీస్ శాఖ ఓకే అంటే.. ఇలాంటివి మరిన్ని తయారు చేసి ఇవ్వటానికి రెడీగా ఉంది.

7306 పోస్టులకు TSPSC నోటిఫికేషన్

గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గురుకులాల్లో 7306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరణ చేపట్టనున్నారు.

రేపే చిన్న‌మ్మ ప్ర‌మాణ‌స్వీకారం

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ రేపు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుంది. ఉద‌యం 9:30 గంట‌ల‌కు మ‌ద్రాస్ యూనివ‌ర్శిటీ సెంట్ర‌ల్‌హాల్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు ఏర్పాట్లు చురుగ్గాసాగుతున్నాయి. శ‌శిక‌ళ‌తోపాటు మ‌రికొంత మంది మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. మ‌రోవైపు నిన్న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వికి రాజీనామా చేసిన ప‌న్నీర్ సెల్వంకు చిన్న‌మ్మ స్పీక‌ర్ ప‌దవి ఇస్తాన‌ని చెప్ప‌గా అందుకు ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. హోంమంత్రి, ఆర్థిక‌శాఖలు ప‌న్నీర్‌సెల్వంకు క‌ట్ట‌బెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ప‌న్నీర్ సెల్వం ఎప్పటికీ అగ్ర‌స్థానంలోనే ఉంటార‌ని శ‌శిక‌ళ పేర్కొన్నారు. ప‌న్నీర్ సెల్వం ఏది అడిగిన ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు శశిక‌ళ చెప్పారు. ఓవైపు చిన్నమ్మ ప్రమాణస్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతుండగా ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంకా చెన్నైకి చేరుకోలేదు. ఈ సాయంత్రం చెన్నైకి చేరుకునే అవకాశం ఉంది లేదా రేపు ఉదయానికల్లా ఆయన చెన్నై చేరుకోవచ్చని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

సహార ఆస్తులు అటాచ్ మెంట్ చేయండి: సుప్రీం

సహరా కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మహారాష్ట్రలోని పుణె లో ఉన్న ఆంబే వాలీలోని రూ.39వేల కోట్ల ఆస్తులు అటాచ్‌ చేయాలని ఆదేశించింది. సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతారాయ్‌ ఇంకా చెల్లించాల్సిన రూ.14,779కోట్ల డబ్బు కోసం ఇలా చేయడం అవసరం అని కోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 20 నాటికి సమస్యాత్మకంగా లేని ఆస్తుల జాబితా అందజేయాలని కోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. సహారా చెల్లించాల్సిన మిగతా డబ్బు కోసం ఈ ఆస్తులను వేలం వేయాలని కోర్టు సూచించింది. సెబీకి రూ.14,779కోట్లు చెల్లించడానికి సహారా 2019 జులై వరకు గడువు కోరింది. డబ్బు తిరిగి చెల్లించడం కోసం గతంలో కోర్టు ఇచ్చిన విధివిధానాల్లో భాగంగా  సోమవారం సెబీకి సహారా గ్రూప్‌ రూ.600కోట్లు చెల్లించింది. అయినప్పటికీ 2019 జులై వరకు గడువు చాలా ఎక్కువ సమయం అవుతుందని… కాబట్టి ఆస్తులు వేలం వేయాలని కోరుతున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. సుబ్రతారాయ్‌ పెరోల్‌ను మరోసారి పొడిగించింది కోర్టు. ఆయన గతేడాది మే నుంచి పెరోల్‌పై బయట ఉంటున్నారు.

సిమ్ కార్డ్ పై సుప్రీం కీలక ఆదేశాలు

అప‌రిమిత సిమ్ కార్డుల‌తో నేరాలు ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇక‌పై ప్ర‌తి సిమ్‌కార్డును ఆధార్ నంబ‌ర్‌తో లింక్ చేయాల్సిందిగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్ర‌క్రియ‌ను ఏడాదిలోగా ముగించాల‌ని కోర్టు ప్ర‌భుత్వాన్ని కోరింది. సిమ్ కార్డు వినియోగించి ఎలాంటి నేర‌పూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా పాలసీని నిర్దేశించాల‌ని మోడీ సర్కార్‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఒక‌రి పేరుతో ఉన్న సిమ్ కార్డును మ‌రొక‌రు నేర‌కార్య‌క‌లాపాల‌కు వాడుతుండ‌టం, సిమ్ కార్డు ఇచ్చేముందు ఎలాంటి ధృవీక‌ర‌ణ మెకానిజం ఉండ‌టం లేద‌ని లోక్‌నీతి అనే సంస్థ ప్ర‌జావాజ్య ప్ర‌యోజ‌నం పిల్ కోర్టులో దాఖ‌లు చేసింది. వివ‌రాల‌ను ధృవీక‌ర‌ణ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల దేశ‌భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశ‌ముంద‌ని పిల్‌లో లోక్‌నీతి పేర్కొంది. దీనిని సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ జేఎస్ కేహ‌ర్ ఆధ్వ‌ర్యంలోని బెంచ్ విచార‌ణ‌కు స్వీక‌రించింది. మొబైల్ స‌బ‌స్క్రైబ‌ర్లంతా త‌మ డీటెయిల్స్‌ను స‌మ‌ర్పించాల‌ని, మొబైల్ నంబ‌ర్‌ను ఆధార్ నంబ‌ర్‌తో అనుసందానం చేసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. రీచార్జి చేసుకున్న ప్ర‌తిసారి విధిగా ఓ ఫామ్‌ను నింపి స‌బ్మిట్ చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని మొబైల్ స‌బ్‌స్క్రైబ‌ర్లంద‌రినీ గుర్తించి వారి వివ‌రాల‌ను ధృవీక‌రిస్తామ‌ని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఇందుకోసం కొత్త పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టి ఓ సంవ‌త్స‌రంలోగా పూర్తి చేస్తామ‌ని సుప్రీం కోర్టుకు వివ‌రించింది కేంద్రం.

సానియా టెన్నిస్ అకాడమి ప్రారంభం

హైదరాబాద్ ఫిలింనగర్‌లో సానియా మిర్జా టెన్నిస్‌ అకాడమీని సానియా ప్రారంభించారు. సానియా ఇంటికి దగ్గర్లో టెన్నిస్‌ అకాడమీ ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ దినకర్‌ హాజరయ్యారు. ఐదేళ్లలోపు చిన్నారుల కోసం అత్యాధునిక ఏర్పాట్లతో అకాడమీ ఏర్పాటు చేశారు సానియా మిర్జా.

భూమికి తప్పిన పెనుముప్పు

భూమికి అతిపెద్ద ముప్పు త‌ప్పింది. ఫిబ్ర‌వ‌రి 2న ఓ భారీ ఉల్క భూమికి అత్యంత స‌మీపంగా వ‌చ్చి దిశ మార్చుకున్న‌ట్లు ఆల‌స్యంగా బ‌య‌ట‌ప‌డింది. ఈ విష‌యాన్ని నాసా అధికారులు ధృవీక‌రించారు. ఒక డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు ప‌రిమాణంలో ఉండే ఈ ఆస్ట‌రాయిడ్ ఫిబ్ర‌వ‌రి 2 రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో భూమికి చంద్రుడికి మ‌ధ్య‌లో అత్యంత వేగంగా దూసుకొచ్చింద‌ని నాసా వెల్ల‌డించింది. భూమికి చేరువ‌య్యే క్ర‌మంలో ఉల్క వేగం  సెక‌నుకు 11.56 కిలోమీట‌ర్లుగా ఉన్నట్లు నాసా వ‌ర్గాలు పేర్కొన్నాయి. దీని క‌క్ష్య శుక్ర గ్రహం కక్ష్య నుంచి అంగారక గ్రహ కక్ష్య వరకు విస్తరించి ఉందని వెల్లడించింది.

జనవరి 24న పరిమాణంలో  కొంచెం తక్కువగా ఉన్న ఆస్టరాయిడ్ భూమికి మ‌రింత చేరువ‌గా వ‌చ్చింద‌ని నాసా తెలిపింది. మొత్తంగా ఒక ఏడాదిలో ఇలాంటి నాలుగు ఉల్క‌లు భూమికి చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాయ‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఒక‌వేళ భూమిని ఢీకొట్టి ఉండిఉంటే భారీ న‌ష్టం వాటిల్లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌ళ్లీ ఇదే త‌రహా ఉల్క ఈ ఏడాది చివ‌రిలో అంటే డిసెంబ‌ర్ 28న భూమికి అత్యంత ద‌గ్గ‌ర‌గా వ‌స్తుంద‌ని …. ఆ స‌మ‌యంలో ఉల్క ప్ర‌యాణించే వేగం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ ఆ ఉల్క భూమిని ఢీ కొడితే మాన‌వ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారే అవ‌కాశం ఉంద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు శాస్త్ర‌వేత్త‌లు.